Asianet News TeluguAsianet News Telugu

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : ఇప్పటివరకు ఎంతమంది సందర్శించారో తెలుసా?

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో కు ప్రజల నుండి అద్భుత స్పందన లభిస్తోంది. ఇప్పటికే లక్షలాదిమంది ఈ కార్యక్రమానికి తరలివచ్చి యూపీ ఉత్పత్తులను తిలకిస్తున్నారు. ఇలా ఈ షో ప్రజల్లోకి బలంగా వెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

UP International Trade Show 2024 witnesses massive crowds in first three days AKP
Author
First Published Sep 28, 2024, 7:26 PM IST | Last Updated Sep 28, 2024, 7:29 PM IST

 గ్రేటర్ నోయిడా : ఉత్తరప్రదేశ్ కి చెందిన పారిశ్రామికవేత్తలు, హస్త కళాకారుల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 (UPITS) నిర్వహిస్తున్నారు. అందరి అంచనాలకు అనుగుణంగానే తొలి ఎడిషన్ విజయవంతం కాగాా ఇప్పుడు ఈ రెండో ఎడిషన్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యే దిశగా దూసుకుపోతోంది.

గత మూడు రోజుల ఈవెంట్ కు 1.75 లక్షల మందికి పైగా హాజరు కావడమే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల్లో 50 వేల మందికి పైగా బిజినెస్ టు బిజినెస్ (బి2బి) విజిటర్లు, 1.25 లక్షల మంది బిజినెస్ టు కన్స్యూమర్స్ (బి2సి) విజిటర్లు ఎక్స్‌పోను సందర్శించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లోని 15 హాళ్లలో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో 2550 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న యూపిఐటిఎస్ 2024 సందర్శకులు

సెప్టెంబర్ 25న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ తొలి రోజు 14,222 మంది బిజినెస్ టు బిజినెస్ (బి2బి) విజిటర్లు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌కు తరలిరాగా, 25,589 మంది బి2సి విజిటర్లు హాజరయ్యారు. ఇలా తొలి రోజే ఈ ట్రేడ్ షోకు 40,811 మంది హాజరయ్యారు. ఇక రెండో రోజు అంటే సెప్టెంబర్ 26న 16,385 మంది బి2బి, 46,552 మంది బి2సి విజిటర్లు అంటే మొత్తం 62,937 మంది సందర్శకులు పాల్గొన్నారు.

ఇంటర్నేషనల్ ట్రేడ్ షో మూడో రోజు అంటే నిన్న శుక్రవారం 20,210 మంది బి2బి, 51,335 మంది బి2సి సహా మొత్తం 71,545 మంది సందర్శకులు హాజరయ్యారు. ఇలా ప్రతి రోజూ సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తుండటం విశేషం. చివరి రెండు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వహకుల అభిప్రాయం. 

వారాంతంలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 కు సందర్శకులు పోటెత్తుతారా? 

రాష్ట్రంలోని అన్ని రకాల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి వేదికను కల్పించాలనే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు ఈ వేదిక ద్వారా యూపీ ఉత్పత్తులు పరిచయం అవుతున్నాయి... దీంతో వీటికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సీఎం యోగి ఆలోచన కూడా. 

యూపీఐటిఎస్ తొలి ఎడిషన్‌లో 70 వేల మంది బి2బి విజిటర్లు, 2.37 లక్షల మంది బి2సి విజిటర్లు పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రెండో ఎడిషన్‌లోనూ భారీ సంఖ్యలో ప్రజలు  పాల్గొంటున్నారు. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో కు తొలి మూడు రోజుల్లోనే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు. మొత్తం మీద ఈ మూడు రోజుల్లో 1,75,283 మంది సందర్శకులు వచ్చారని... ఇక మిగిలిన ఈ రెండు రోజులు వీకెండ్ కాబట్టి భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం 5 రోజుల పాటు జరిగే ఈ షో లో పాల్గొన్నవారి సంఖ్య గణనీయంగా వుంటుందని అంటున్నారు. 

సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్న యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో

యూపీ ఇంటర్నేషనల్ షో కు ప్రజాదరణ ఏ స్థాయిలో వుందో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ మెగా ఈవెంట్‌ను ప్రచారం చేయడానికి వివిధ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించగా... గత 179 రోజుల్లో అవి కోట్ల మందిని చేరుకున్నాయి. #UPITS2024 హ్యాష్‌ట్యాగ్ 179 రోజుల్లో 32 మిలియన్ల (3.20 కోట్లు) మందికి చేరువైంది. అదేవిధంగా #UPInternationalTradeShow హ్యాష్ ట్యాగ్ 27 మిలియన్ల (2.7 కోట్లు), #Upinternationaltradeshow2024 హ్యాష్ ట్యాగ్ 4.8 మిలియన్లు (48 లక్షలు), #UPITS హ్యాష్ ట్యాగ్ 71.9 వేలు, #GlobalBizHubUP హ్యాష్ ట్యాగ్ 65.9 వేల మందికి చేరుకున్నాయి.

మాజీ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా UPITS సందర్శన

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024ను సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మాజీ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వేదికను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యీడా) పెవిలియన్‌ను కూడా సందర్శించారు. అథారిటీ సీఈఓ డాక్టర్ అరుణ్‌వీర్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టుల (మెడికల్ డివైజెస్ పార్క్, టాయ్ పార్క్, అపెరల్ పార్క్) పురోగతిని మాజీ సీఎస్ కు సిఈవో ఆయనకు వివరించారు. అలాగే, అథారిటీ ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టుల (సెమీ కండక్టర్ పార్క్, ఐటీ & సాఫ్ట్‌వేర్ పార్క్, ఫిన్‌టెక్ సిటీ, హెరిటేజ్ సిటీ, మిక్స్‌డ్ ల్యాండ్ యూజ్, ఎడ్యుకేషన్ హబ్ మొదలైనవి) గురించి కూడా సమాచారం అందించారు. ఇలా యోగి సర్కార్ యూపీ అభివృద్దికి చేస్తున్న కృషిని దుర్గా శంకర్ మిశ్రా ప్రశంసించడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios