యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 : నోయిడా హోటళ్లకు లాభాల పంట
గ్రేటర్ నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షో ఎగ్జిబిటర్లకు మాత్రమే కాకుండా హోటల్ పరిశ్రమకు కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ షో కారణంగా హోటళ్ల వ్యాపారం 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది.
గ్రేటర్ నోయిడా : ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో కేవలం వ్యాపారులకు మాత్రమే కాదు గ్రేటర్ నోయిడాలోని హోటల్ పరిశ్రమకు కూడా మంచి లాభాలను చేకూర్చింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ ట్రేడ్ షో కారణంగా ఇండియా ఎక్స్‌పో మార్ట్ చుట్టుపక్కల ఉన్న హోటళ్ల వ్యాపారం 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దీంతో ట్రేడ్ షో లో పాల్గొన్న వ్యాపారులే కాదు నోయిడాలో హోటల్ వ్యాపారులు యోగి సర్కార్ చొరవను ప్రశసించారు.
అంతర్జాతీయ ట్రేడ్ షోలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ఎగ్జిబిటర్లు, సందర్శకులు గ్రేటర్ నోయిడాకు విచ్చేసారు. వీరంతా ట్రేడ్ షో జరిగే ప్రాంతానికి దగ్గర్లో గల హోటళ్లలో బస ఏర్పాటు చేసుకున్నారు. దీంతో దాదాపు అన్ని పెద్ద హోటళ్లు కిటకిటలాడాయి. ఇలా దేశవిదేశాల నుండి వచ్చిన అనేక మంది సందర్శకులు గ్రేటర్ నోయిడాలో హోటళ్లలో గదులు దొరక్క ఢిల్లీలోని హోటళ్లలో గదులను బుక్ చేసుకోవాల్సి వచ్చింది.
ట్రేడ్ షో జరిగిన ఇండియా ఎక్స్‌పో మార్ట్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాంతం. ఇక్కడ వివిధ రకాల భారీ కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఇలా యోగి ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ ట్రేడ్ షో రెండవ ఎడిషన్ కూడా ఇక్కడే జరిగింది. ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 25న ప్రారంభమై సెప్టెంబర్ 29న వరకు సాగింది. ట్రేడ్ షో ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు హాజరయ్యారు.
ఈ అంతర్జాతీయ ట్రేడ్ షోను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, గ్రేటర్ నోయిడా హోటల్ పరిశ్రమ కూడా దీని కోసం చాలా సన్నాహాలు చేసింది. ట్రేడ్ షో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది, రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ఎగ్జిబిటర్లు, లక్షలాది మంది కొనుగోలుదారులు వస్తారు. విదేశాల నుండి కూడా కొనుగోలుదారులు వస్తారు. కాబట్టి వీరికి సరైన సదుపాయాలు కల్పించడానికి నోయిడాలోకి హోటళ్లు సిద్దం చేసారు.
ఊహించినట్లుగనే ఇండియా ఎక్స్‌పో మార్ట్ చుట్టుపక్కలతో పాటు గ్రేటర్ నోయిడాలోని అన్ని హోటళ్లలో రద్దీ కనిపించింది. నోయిడాతో పాటు ఢిల్లీలోని హోటళ్లు కూడా సాధారణ రోజుల కంటే ఎక్కువగా రద్దీగా మారాయి. ఇలా ట్రేడ్ షో ద్వారా కేవలం ఎగ్జిబిటర్లతో పాటు హోటల్ పరిశ్రమకు కూడా లబ్ది చేకూరింది. వారి వ్యాపారం అంచనాలకు మించి జరిగింది... దీంతో హోటళ్ళ యాజమాన్యాలు యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
హోటల్ పరిశ్రమకు చెందిన సంజయ్ ప్రకాష్ మాట్లాడుతూ... ఈ ట్రేడ్ షో తమ అంచనాల కంటే చాలా మెరుగ్గా ఉందని అన్నారు. ఈ సమయంలో హోటళ్లకు చాలా మంచి బుకింగ్‌లు వచ్చాయని, రెస్టారెంట్లలో కూడా వినియోగదారుల రద్దీ పెరిగిందని చెప్పారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, యోగి ప్రభుత్వాన్ని ఎంత ప్రశంసించినా తక్కువేనని అన్నారు. వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని, దీని ఫలితంగా ఇక్కడ నిరంతరం పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
హోటల్ పరిశ్రమకు చెందిన నీతా శర్మ మాట్లాడుతూ... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించామని, దీని ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించామని చెప్పారు. నేడు యోగి నాయకత్వంలో రాష్ట్రంలో చట్టాలు బలోపేతం కావడంతో ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తున్నారని ఆమె అన్నారు. గత ట్రేడ్ షో కారణంగా కూడా తమ వ్యాపారం పెరిగిందని, ఈసారి అంతకుమించి వ్యాపారం జరిగిందని ఆమె అన్నారు.