లాక్ డౌన్ పెళ్లి.. ఒంటరిగా వెళ్లి.. బైక్ పై వధువుతో...

వరుడు ఒంటరిగా బైక్ పై వెళ్లి వెళ్లి వధువును తన ఇంటికి తీసుకువచ్చాడు. ఛతర్‌పూర్ జిల్లాలోని నౌగావ్‌లో నివసిస్తున్న సునీల్ అహిర్‌వార్ కు ఏప్రిల్ 28 న వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా వివాహం ఆగిపోయింది. 

UP groom rides motorcycle to bride's home amid coronavirus lockdown

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ కారణంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగానే దేశంలో లాక్ డౌన్ విధించారు. 

అయితే.. చాలా మంది ఈ లాక్ డౌన్ కారణంగా తమ ఇళ్లల్లో జరగాల్సిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఒకరిద్దరి సమక్షంలో కానిచ్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వరుడు ఒంటరిగా బైక్ పై వెళ్లి వెళ్లి వధువును తన ఇంటికి తీసుకువచ్చాడు. ఛతర్‌పూర్ జిల్లాలోని నౌగావ్‌లో నివసిస్తున్న సునీల్ అహిర్‌వార్ కు ఏప్రిల్ 28 న వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా వివాహం ఆగిపోయింది. 

దీనితో వరుడు ఒంటరిగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళికొడుకు  దుస్తులు ధరించి, తలపై తలపాగా పెట్టుకుని, బైక్ పై వధువు ఇంటికి వెళ్ళాడు. అతనిని చూసి అత్తామామలు ఆశ్చర్యపోయారు. వరుడు తన జీవిత భాగస్వామిని బైక్ మీద ఎక్కించుకుని,తన ఇంటికి బయలు దేరాడు. గరౌలి అవుట్‌పోస్ట్ పోలీసులు వారిని ఆపారు. దీనితో విషయమంతా వారికి చెప్పి  ముందుకు వెళ్లేందుకు అనుమతి పొందాడు. చివరికి తన జీవిత భాగస్వామిని ఇంటికి తీసుకువచ్చాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios