UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. పార్టీల గెలుపును.. ముఖ్యంగా యాదవుల ప్రాబల్యం అధికంగా ఉండే పశ్చిమ యూపీ సహా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి ఓటింగ్, పార్టీల బలాలు, ముందస్తు పోలింగ్ సర్వే అంచనాలు సహా పలు వివరాలు ఇలా ఉన్నాయి..
,UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక అత్యంత కీలకమైన.. అధికారం చేపట్టబోయే పార్టీల గెలుపును నిర్ణయించే.. యాదవులు కంచుకోట అయిన పశ్చిమ యూపీతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు మూడో దశ ఎన్నికలు జరగున్నాయి. శుక్రవారంతో ఎన్నికల థర్డ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్‌కు ప్రచారం ముగియనుంది. మొదటి రెండు దశలకు వరుసగా ఫిబ్రవరి 10న, ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది. 3వ దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో యాదవుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తమ సర్వశక్తులు ఒడ్డాయి. మూడో దశలో 59 స్థానాలకు పోలింగ్ జరగనున్న 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ జిల్లాలు ఫిరోజాబాద్, మైన్‌పురి, ఎటా, కస్గంజ్, హత్రాస్, కాన్పూర్, కాన్పూర్ దేహత్, ఔరైయా, కన్నౌజ్, ఇటావా, ఫరూఖాబాద్, ఝాన్సీ, జలౌన్, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబాలు ఉన్నాయి.
పోలింగ్ సమయం..
ఫిబ్రవరి 20న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఓటింగ్ జరుగుతుంది. దీని కోసం ఎన్నికల సంఘంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
యూపీ థర్డ్ ఫేజ్ లో ఎన్నికు జరిగే నియోజకవర్గాలు ఇవే..
ఎటా, మర్హారా, జలేసర్ (SC), మైన్‌పురి, భోంగావ్, కిష్ని (SC), కర్హల్, కైమ్‌గంజ్ (SC), అమృత్‌పూర్, ఫరూఖాబాద్, భోజ్‌పూర్, ఛిబ్రమౌ, తిర్వా, కన్నౌజ్ (SC), జస్వంత్‌నగర్ ఇటావా, భర్తన (SC), హత్రాస్ (SC), సదాబాద్, సికంద్ర రావు, తుండ్ల (SC), జస్రానా, ఫిరోజాబాద్, షికోహాబాద్, సిర్సాగంజ్, కస్గంజ్, అమన్‌పూర్, పటియాలీ, అలీగంజ్, బిధునా, దిబియాపూర్, ఔరయ్య (SC), రసూలాబాద్ (SC), ), అక్బర్‌పూర్-రానియా, సికంద్రా, భోగ్నిపూర్, బిల్హౌర్ (SC), బితూర్, కళ్యాణ్‌పూర్, గోవింద్‌నగర్, సిషామౌ, ఆర్య నగర్, కిద్వాయ్ నగర్, కాన్పూర్ కాంట్., మహారాజ్‌పూర్, ఘతంపూర్ (SC), మధౌగర్, కల్పి, ఒరై (SC), బబినా , ఝాన్సీ నగర్, మౌరానీపూర్ (SC), గరౌత, లలిత్‌పూర్, మెహ్రోని (SC), హమీర్‌పూర్, రాత్ (SC), మహోబా, చరఖారి స్థానాలకు థర్డ్ ఫేస్ లో ఎన్నికలు జరగనున్నాయి.
థర్డ్ ఫేజ్ లో పోటీ పడుతున్న ముఖ్య అభ్యర్థులు వీరే..
పోలింగ్ జరిగే 59 నియోజకవర్గాల నుండి మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 96 మంది అభ్యర్థులు మహిళలు. కీలక అభ్యర్థుల విషయానికొస్తే.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్‌తో తలపడనున్న కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పోరు సాగే స్థానాలు. అలాగే, జస్వంత్‌నగర్ స్థానం నుంచి ఎస్పీకి చెందిన శివపాల్ యాదవ్ వర్సెస్ బీజేపీకి చెందిన వివేక్ షాక్యా, కన్నౌజ్ స్థానం నుంచి ఎస్పీకి చెందిన అనిల్ కుమార్ దోహరే వర్సెస్ బీజేపీకి చెందిన అసిమ్ అరుణ్, సిర్సాగంజ్ స్థానం నుంచి బీజేపీకి చెందిన హరి ఓం యాదవ్ వర్సెస్ ఎస్పీ సర్వేష్ సింగ్ పోటీలో ఉన్నారు. హత్రాస్ స్థానం నుంచి ఎస్పీ నుంచి బ్రిజ్ మోహన్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి అంజులా మహోర్ బరిలోకి దిగారు.
ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇలా ఉన్నాయి..
ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్ సమాజ్ వాదీ పార్టీపై బీజేపీ అధిపత్యం ఉంటుందని పేర్కొన్నాయి. అయితే చాలా స్థానాల్లో చాలా గట్టి పోటీ ఉంటుందని తెలిపాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రెండు పార్టీలు ఏ మాత్రం వెనుకంజ వేయకపోవడంతో ఫలితం ఏవైపుకైనా ళ్లవచ్చు అని పేర్కొన్నాయి. అయితే, మొదటి నుంచి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో యాదవుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్ వాదీ పార్టీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
