గత ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయలేదని, కేవలం యూపీని దోచుకోవడం మాత్రమే వాటి లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. 

Up election news 2022 : యూపీ (up)లో గతంలో అధికారం చేపట్టిన పార్టీలకు ప్రజల విశ్వాసం, అవసరాలు పట్టించుకోలేని ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వాటి ఏకైక ఎజెండా అని చెప్పారు. యూపీ అసెంబ్లీ తొలి దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు మధుర (madhura), ఆగ్రా (agra), బులంద్‌షహర్‌ (bulandshahar)లలో ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల తీరుపై ఆయన మండిపడ్డారు. ‘‘ గతంలో అధికారంలో ఉన్నవారు మీ విశ్వాసం, మీ అవసరాల గురించి పట్టించుకోలేదు. వారి ఏకైక ఎజెండా యూపీని దోచుకోవడమే ’’ అని ప్ర‌ధాని అన్నారు. 

డబ్బు, కండబలం, కులతత్వం, మతతత్వం ప్రాతిపదికన కొందరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజల ప్రేమను పొందలేరని యూపీ ప్రజలు ముక్కుసూటిగా చెప్పార‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. సేవక్ (సేవకులు)గా మారి వారికి సేవ చేసే వారిపై ప్రజల ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన కలలో శ్రీకృష్ణుడిని చూశానని ఇటీవల చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మాట్లాడుతూ.. “బీజేపీ (bjp)కి ఉన్న అపారమైన మద్దతును చూసి, ఈ ప్రజలు ఇప్పుడు తమ కలలలో శ్రీకృష్ణుడిని చూస్తున్నారు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధియే అతిపెద్ద సమస్య అని, యూపీ ప్ర‌జ‌లు త‌మ‌కు ఏం కావాలో వారే నిర్ణ‌యించుకుంటార‌ని తెలిపారు. 

ఇదిలా ఉండ‌గా.. ఈ సారి యూపీలో జ‌రిగే ఎన్నిక‌లకు ఓ ప్రాధాన్య‌త ఉంది. ఉత్త‌రప్ర‌దేశ్ లో రెండు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ (bjp), స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party)నుంచి సీఎం అభ్య‌ర్థులుగా ఉన్న యోగి ఆదిత్య‌నాథ్, అఖిలేష్ యాద‌వ్ మొట్ట మొద‌టి సారి శాస‌న మండ‌లికి పోటీ చేస్తున్నారు. వీరు సీఎంగా యూపీని పాలించ‌నప్ప‌టికీ ఒక్క సారిగా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు.శాస‌నమండ‌లికి ఎన్నికై సీఎం బాధ్య‌తలు నిర్వ‌ర్తించారు. అయితే ఈ సారి మొద‌టి సారిగా గోర‌ఖ్ పూర్ స్థానం అర్బ‌న్ స్థానం నుంచి యోగి ఆదిత్య‌నాథ్ పోటీలో ఉంటార‌ని యూపీ బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం వెలువ‌డిన రోజుల వ్య‌వ‌ధిలో అఖిలేష్ యాద‌వ్ కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌ని స‌మాజ్ వాదీ పార్టీ ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నిక‌లు కొంత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల కిందటే యోగి ఆదిత్య‌నాథ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (central home minister amith sha) స‌మ‌క్షంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. 

403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఏడు దశల్లో జ‌ర‌గ‌నున్నాయి. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, ఫిబ్రవరి 23న నాలుగో దశ, ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ‌లో జ‌రుగుతాయి. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.