ఒలింపిక్, పారా ఒలింపిక్స్ విజేతలకు యోగి బంపరాఫర్ ... కోట్ల నగదుతో పాటు గవర్నమెంట్ జాబ్
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒలింపిక్, పారా ఒలింపిక్ విజేతలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. పతక విజేతలకు నగదు బహుమతులు అందజేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని యోగి హామీ ఇచ్చారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ యువతను 'క్రీడలవైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది యోగి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పటికే క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో సత్తాచాటి భారత్ కు పతకాలు అందించిన యూపీ క్రీడాకారుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ సత్కరించారు.
మంగళవారం లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో యూపీకి చెందిన ఒలింపిక్ క్రీడాకారులకు సత్కార కార్యక్రమంలో జరిగింది. ఇందులో 14 మంది ఒలింపిక్, పారా ఒలింపిక్ క్రీడాకారులు పాల్గొన్నారు... వీరికి స్వయంగా సీఎం యోగి సత్కరిస్తారు. వీరిలో ఏడుగురు ఒలింపిక్ పతక విజేతలు కాగా, మరో ఏడుగురు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు.
క్రీడాకారులకు మొత్తం 22.70 కోట్ల రూపాయల నగదు బహుమతులను సీఎం యోగి స్వయంగా అందజేస్తారు. ఈ సన్మాన సభ ద్వారా ప్రపంచ వేదికపై దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన క్రీడాకారులను ప్రశంసించడమే కాకుండా, యువ క్రీడాకారులకు స్ఫూర్తిని కలిగిస్తుంది. సన్మానం అందుకోనున్న పతక విజేతలలో ప్రవీణ్ కుమార్, సుహాస్ ఎల్‌వై, అజిత్ సింగ్, ప్రీతి పాల్, సిమ్రాన్, లలిత్ ఉపాధ్యాయ, రాజ్ కుమార్ పాల్ ప్రముఖులు.
ఒలింపిక్ పతక విజేతలకే కాదు పాల్గొన్నవారికి ప్రోత్సాహకాలు
పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల కేటగిరీలో బంగారు పతకం సాధించిన ప్రవీణ్ కుమార్‌కు 6 కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేసారు సీఎం యోగి. అలాగే రజత పతకాలు సాధించిన సుహాస్ ఎల్‌వై, అజిత్ సింగ్‌లకు ఒక్కొక్కరికి 4 కోట్ల రూపాయలు... రెండు కాంస్య పతకాలు సాధించిన ప్రీతి పాల్‌కు 4 కోట్ల రూపాయలు, కాంస్య పతకం సాధించిన సిమ్రాన్‌కు కోటి రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అదేవిధంగా పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో చోటు దక్కించుకున్న లలిత్ ఉపాధ్యాయ, రాజ్ కుమార్ పాల్‌లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతి అందజేసారు.
పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొని ఉత్తరప్రదేశ్ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన పారుల్ చౌదరి, అను రాణి, ప్రియాంక గోస్వామి, ప్రాచి చౌదరి, సాక్షి కసానా, దీపేష్ కుమార్, యశ్ కుమార్‌లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేసారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి క్రీడాకారులతో ముచ్చటించడంతో పాటు, వారి స్ఫూర్తిదాయకమైన కథలను భావి తరాల క్రీడాకారులకు తెలియజేసి వారిని ప్రోత్సహించారు.