Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : యూపీలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామ‌స్తులు

యూపీలోని ముజఫర్ నగర్ లో ప్రచారానికి వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీకి వ్యతిరేకంగా గ్రామస్తులంతా నినాదాలు చేశారు. దీంతో అతడు వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అతడి కారు చుట్టూ చేరి అరుస్తూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

up assembly election 2022: Villagers oust MLAs who went on campaign in UP.
Author
Muzaffarnagar, First Published Jan 20, 2022, 12:44 PM IST

అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు యూపీలో (uthara pradhesh) చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నాయ‌కులు.. రోజుల వ్య‌వ‌ధిలోనే ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిపోతున్నారు.ప్ర‌తిప‌క్ష పార్టీలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వ్య‌క్తులే..  త‌రువాత అధికార పార్టీ కండువా క‌ప్పుకొని క‌నిపిస్తున్నారు. ఇలా యూపీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా క‌నిపిస్తున్నాయి. 

యూపీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నకొద్దీ నాయకుల్లో టెన్ష‌న్ (tention) మొద‌లైంది. ఎప్పుడూ నియోజక‌వ‌ర్గాలను క‌న్నెత్తి చూడ‌ని నాయ‌కులు గ్రామాల‌న్నీ చుట్టేస్తున్నారు. త‌మ‌కు ఓటేయాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత నియోజ‌క‌వర్గ అభివృద్ధిని ప‌ట్టించుకోని లీడ‌ర్లు..గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇలా ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్నాయి. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం గ్రామానికి వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించేందుకు వ‌చ్చిన ఆ నాయ‌కుడిని గ్రామస్తులంతా క‌లిసి త‌రిమికొట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో (social media)  వైర‌ల్ గా (viral) మారింది. 

యూపీలోని ముజ‌ఫ‌ర‌న‌గ‌ర్ (muzafarnagar) నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. క‌తౌలీకి (kathuli) చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్ర‌మ్ సింగ్ సైనీ (bjp mla vikram singh sainy) బుధవారం ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన మీటింగ్ (meeting) హాజ‌ర‌య్యేందుకు వచ్చాడు. అత‌డిపై కోపంగా ఉన్న ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం రద్దు చేసిన వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ప‌లువురు స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో అత‌డు అక్క‌డి నుంచి పారిపోవ‌వాల్సి వ‌చ్చింది. అయితే అత‌డి కారును కూడా స్థానికులు అరుస్తూ వెంబ‌డించారు. 

గ‌తంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఈ బీజేపీ ఎమ్మెల్యే విక్ర‌మ్ సింగ్ సైనీ (vikram singh saily) వార్త‌ల్లో నిలిచారు. భార‌త‌దేశం  సుర‌క్షితం కాద‌ని భావించే వారిపై బాంబు వేస్తాన‌ని 2019 సంవ‌త్స‌రంలో చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి. దాని కంటే ఓ ఏడాది ముందు ‘‘మన దేశాన్ని హిందూస్తాన్ అంటారు. అంటే హిందువుల దేశం’’ అని అన్నారు ‘‘ఆవులను చంపేవారి కాళ్ల విరగ్గొడతాను’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికార పార్టీగా బీజేపీ (bjp), ప్ర‌తిప‌క్ష పార్టీగా స‌మాజ్ వాదీ (samajwadi) వ్య‌వ‌హరిస్తున్నాయి. ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యుల్ లో భాగంగా యూపీలో కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్ర‌వ‌రి 10వ (february) తేదీ నుంచి ఎన్నిక‌లు జ‌రగుతాయి. మొత్తం ఏడుద‌శల్లో ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మొద‌టి ద‌శ ఫిబ్ర‌వ‌రి- 10, రెండో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 14, మూడో ద‌శ ఫిబ్ర‌వ‌రి - 20, నాలుగో ద‌శ  ఫిబ్ర‌వ‌రి -23, ఐదో ద‌శ -27, ఆరో ద‌శ మ‌ర్చి -3, ఏడో ద‌శ మార్చి -7వ తేదీన జ‌ర‌గనున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నిక‌ల కౌంటింగ్ (counting) మొద‌లు పెట్టి అదే రోజు ఫ‌లితాలు వెళ్ల‌డిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios