Asianet News TeluguAsianet News Telugu

UP Elections 2022: యూపీ ఎన్నిక‌లు.. బైపోలార్ పోటీ.. అఖిలేష్ యాదవ్ కు అధికారం దక్కేనా?

UP Elections 2022: ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్ది యూపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, ఈ సారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (UP Elections) ముఖ్యంగా యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని  బీజేపీ, అఖిలేష్ యాద‌వ్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోరు ఉంటుంద‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతోంది. కాంగ్రెస్‌, బీఎస్పీల ప్ర‌భావం త‌గ్గ‌డంతో ప్ర‌స్తుతం బైపోలారిటీ ఈ ఎన్నిక‌ల్లో ఎంతమేర ప్ర‌భావం చూపుతుంది?  బైపోలార్ పోటీ అఖిలేష్ యాద‌వ్ కు అధికారం క‌ట్ట‌బెడుతుందా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో  మొద‌లైంది. 

UP Assembly Election 2022: Does a Bipolar Contest Really Help Akhilesh Yadav?
Author
Hyderabad, First Published Jan 25, 2022, 2:59 PM IST

UP Assembly Election 2022: ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది రాష్ట్ర రాజ‌కీయాలు కాకా రేపుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. పార్టీ వీడుతున్న వారిలో పాటు, ఎమ్మెల్యేల‌కు ప‌ట్ల స్థానికంగా వ‌స్తున్న వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇదే స‌మ‌యంలో స‌మాజ్‌వాదీ పార్టీ త‌న‌దైన దూకుడుతో ఎన్నిక‌ల (UP Assembly Election 2022) ప్ర‌చారంలో దూసుకుపోతోంది. ఒక‌ప్పుడు రాష్ట్రంలో కింగ్ లా ఉన్న బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ, కాంగ్రెస్ లు ప్ర‌భావం త‌క్కువ‌నే చెప్పాలి. కానీ ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీలు కూడా ఓట‌ర్ల‌ను త‌మ‌పైపు తిప్పుకునే విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారం.. హామీలతో ముందుకు సాగుతున్నాయి. 

అయితే, ఈ సారి జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్యంగా యోగి ఆదిత్యానాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని  బీజేపీ, అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) నాయ‌క‌త్వం వ‌హిస్తున్న స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోరు ఉంటుంద‌ని ప్ర‌స్తుత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతోంది. కాంగ్రెస్‌, బీఎస్పీల ప్ర‌భావం త‌గ్గ‌డంతో ప్ర‌స్తుతం బైపోలారిటీ ఈ ఎన్నిక‌ల్లో (UP Assembly Election 2022) ఎంతమేర ప్ర‌భావం చూపుతుంది?  బైపోలార్ పోటీ అఖిలేష్ యాద‌వ్ కు అధికారం క‌ట్ట‌బెడుతుందా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో  మొద‌లైంది. యూపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా సాధారణంగా వినిపించే  ప‌దం బైపోలార్‌. రాష్ట్రంలో ప్ర‌స్తుతం బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల గ్రాఫ్ ప‌డిపోయి స్వ‌ల్ప స్థానాల‌కే ప‌రిమితం కావ‌డంతో ద్విధ్రువ పోటీ నెల‌కొన్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఎన్నికల్లో బైపోలారిటీ ఏ మేరకు ఉందనేది చర్చనీయాంశమైనప్పటికీ ఇందులో కొంత నిజం ఉండవచ్చు.  కానీ స‌ర్వేలు ఇత‌ర పార్టీల‌ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నాయ‌నే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల(UP Assembly Election) ఫ‌లితాలు గ‌మ‌నిస్తే.. 2017లో బీజేపీ దాని మిత్ర ప‌క్షాలు స్వ‌ల్ప మెజారిటీతో అధికంగా సీట్లు గెలుచుకున్నాయి. ఎన్‌డీఏ గెలుచుకున్న మొత్తం 325 స్థానాల్లో 103కు పైగా సీట్ల‌ను అతి స్వ‌ల్ప మెజారిటీతో ద‌క్కించుకున్నాయి. కాబట్టి స‌మాజ్ వాదీ పార్టీ ప్రతిపక్ష ఓట్లను ఏకీకృతం చేస్తే, ఈ సీట్లు మారే అవకాశం ఉంది.  అలాగే, కాంగ్రెస్‌, బీస్పీ, ఎస్పీ మ‌ధ్య పోటీ ఉండ‌టంతో  ముస్లీం కోట్ల చీలిక కార‌ణంగా బీజేపీకి క‌లిసివ‌చ్చింద‌నే చెప్పాలి. ముస్లీం ఓట్ల చీలిక కార‌ణంగా బీజేపీ దాదాపు 40 సీట్లు కైవ‌సం చేసుకుంద‌నే అంచ‌నాలున్నాయి. బైపోలారిటీ పెంచ‌డం వ‌ల్ల ఇలాంటి సీట్ల సంఖ్య‌ను త‌గ్గించే అవ‌కాశముంది. అయితే, 2017లో బీజేపీ చేరిన ఈ ఓట్లు ఈ ఎన్నిక‌ల్లో ఎస్పీ ఖాతాలో ప‌డేవ‌కాశాలు ఉన్నాయి. 

అయితే, బీజేపీకి వ్య‌తిరేకంగా కొన‌సాగే బైపోలార్ పోటీ అఖిలేష్ యాద‌వ్ కు అధికారం క‌ట్ట‌బెడుతుందా? అనే  ఖ‌చ్చిత‌మైన స‌మాధానం మాత్రం లేదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఇదివ‌ర‌క‌టి బైపోలార్ పోటీ గ‌ణాంకాలు మిశ్ర‌మ ఫ‌లితాలను అందించాయి. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన తాజా ఒపీనియన్ పోల్స్‌ను విశ్వసిస్తే, ఓట్ల శాతం పరంగా ఎస్పీ కూటమి ఎన్డీయే కంటే దాదాపు 7 శాతం వెనుకబడి ఉంది. అంటే ఇప్పటి వరకు అది సాధించగలిగిన ప్రతిపక్షాల ఓట్ల ఏకీకరణ వల్ల దాని లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో (UP Assembly Election 2022) స‌మాజ్ వాదీ పార్టీ అధికార పీఠం ద‌క్కించుకోవాలంటే రెండు విష‌యాలు జ‌ర‌గాలి. అందులో మొద‌టిది బీఎస్పీ ఓట్ల వాటాను పూర్తిగా త‌న ఎస్పీ త‌న‌వైపు తిప్పుకోవాలి. ఇది జ‌ర‌గ‌క‌పోతే రెండో విష‌యం... ఎన్డీఏ ఓట్ల వాటాలో దాదాపు 4 నుంచి 5 శాతం ఎస్పీ త‌న‌వైపు రాబ‌ట్టుకోగ‌ల‌గాలి. ఇది జ‌ర‌గాలంటే అసంతృప్తుల ఓట్ల‌తో పాటు ఓబీసీ ఓట‌ర్లు కీల‌కం కానున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios