కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు ఓ తీపి కబురు అందింది.

కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు ఓ తీపి కబురు అందింది. సోమవారం విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో స్మృతీ కుమార్తె జోయిష్ 82% మార్కులు సాధించడంతో ఆమె ఖుషీ అవుతున్నారు.

దీంతో స్మృతీ తన ఆనందాన్ని ట్వీట్టర్‌లో పంచుకున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య కూడా తన కుమార్తె ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవడం గర్వంగా ఉందన్నారు. ‘‘భవిష్యత్తుకు ఇదే నాంది జో’’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా కొద్దిరోజుల క్రితం విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆమె కుమారుడు జోహర్‌ 91% మార్కులు సాధించారు. ప్రధాని నరేంద్రమోడీ, ప్రకాశ్ జవదేకర్‌ సీబీఎస్ఈలో ప్రతిభ చూపిన విద్యార్ధులను అభినందించారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…