Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్‌కు రూ.468 కోట్లు: రాజ్యసభలో అమిత్ షా

ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది వద్ద సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా . ఈ మేరకు ఆయన మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 
 

union home minister amit shah key announcement in uttarakhand floods ksp
Author
New Delhi, First Published Feb 9, 2021, 5:32 PM IST

ఉత్తరాఖండ్‌లోని ధౌలిగంగా నది వద్ద సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా . ఈ మేరకు ఆయన మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 

ఉత్తరాఖండ్‌లోని విపత్తు ప్రాంతాల్లో కేంద్రం, రాష్ట్రానికి చెందిన అన్ని సహాయక బృందాలు ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయని అమిత్ షా చెప్పారు. విపత్తు ప్రభావిత 13 గ్రామాల్లో వైద్యం, ఆహార పంపణీ సహా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఐటీబీపీ జవాన్లు 450 మంది, ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 8 ఇండియన్‌ ఆర్మీ బృందాలు, నేవీ బృందం, భారత వైమానిక దళానికి చెందిన ఐదు హెలికాప్టర్లు సహాయక చర్యలు తలమునకలై వున్నాయని హోంమంత్రి తెలిపారు.

Also Read:తేరుకోని ఉత్తరాఖండ్: బయటపడుతున్న మృతదేహాలు .. 31కి చేరిన మృతులు

దీనితో పాటు ఉత్తరాఖండ్‌కు విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కోసం 2020-21 బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో తొలి విడతగా రూ.468కోట్లు మంజూరు చేశామని అమిత్ షా చెప్పారు.

విపత్తు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలతో పాటు పునరావాస కార్యక్రమాల్ని ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.  ఎన్టీపీసీ హైడ్రో ప్రాజెక్టు టన్నెల్‌ నుంచి 12 మంది, రిషి గంగా ప్రాజెక్టు సమీపంలోని టన్నెల్‌ నుంచి 15 మందిని సహాయక బృందాలు రక్షించాయని అమిత్ షా తెలిపారు.

అలాగే మరో ఎన్టీపీసీ ప్రాజెక్టు టన్నెల్‌లో ఇంకా 25 నుంచి 35 మంది చిక్కుకున్నట్లు సమాచారం వుందని వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టామని హోంమంత్రి సభకు వివరించారు. అమిత్‌షా ప్రసంగం తర్వాత సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించి ఉత్తరాఖండ్‌ బాధితులకు నివాళి అర్పించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios