Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్: అమిత్ షా అత్యవసర సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

union home minister amit shah emergency meeting over corona situation in NCR ksp
Author
New Delhi, First Published Nov 15, 2020, 3:00 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

దేశ రాజధానిలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. దీపావళి తర్వాత వైరస్‌ ఉధృతి, ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.

కాగా, గత కొన్ని నెలలుగా రాజధానిలో కరోనా కట్టడికి కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ సంయుక్తంగా పోరాటం చేస్తున్నాయి. దీపావళి సహా మరికొన్ని కారణాలతో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

ఏక్యూఐ ఇండెక్స్‌ నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ అధికారులు తెలిపారు. బాణసంచాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. గాలి నాణ్యతలో మార్పు రాలేదన్నారు. గడిచిన 24 గంటల్లో ఏక్యూఐ 461 పాయింట్లు నమోదైందని వెల్లడించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios