Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఈ నెలలో రూ. 95వేల కోట్లు విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రాలకు అందించాల్సిన పన్ను షేర్‌ను ఈ నెలకు గానూ రూ. 47,541 కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి తోడు అదనంగా అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మరో రూ. 47,541 కోట్లనూ అందించనున్నట్టు బంపర్ ఆపర్ ప్రకటించింది. అంటే.. జనవరి నెలకుగాను ట్యాక్స్ డెవల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రూ. 95,082 కోట్లు అందనున్నాయి. ఇలా అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ అందించడం రెండోసారి. చివరి సారి నవంబర్‌లో అందించింది.
 

union govt to release 95 lakh crore to states under tax devolution
Author
New Delhi, First Published Jan 20, 2022, 2:47 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల రాష్ట్రాలకు రూ. 47,541 ట్యాక్స్ డెవల్యూషన్(Tax Devolution) నిధుల(Funds)ను విడుదల చేయనుంది. దీనికి తోడు అదనంగా మరో రూ. 47,541 నిధులను అడ్వాన్స్‌గా(Advance Installment) విడుదల చేయనుంది. అంటే.. ఈ నెలకు గాను రాష్ట్రాలు(States) రూ. 95,082 కోట్ల నిధులను పొందనున్నాయి. నిజానికి ఈ నెలలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను షేర్‌‌గా రూ. 47,541 కోట్ల నిధులు రావాల్సి ఉన్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నిధులతోపాటు అడ్వాన్స్‌గా మరో వాయిదా మొత్తాన్ని అందించడానికి కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమ్మతించారు. అంటే.. జనవరి నెలలో కేంద్రం నుంచి రాష్ట్రాలు ట్యాక్స్ డెవల్యూషన్ కింద పొందాల్సిన నిధులకు రెట్టింపు పొందనున్నాయి.

ఇలా నెలవారీగా అందించే ఈ ట్యాక్స్ డెవల్యూషన్‌తోపాటు అదనంగా ఒక నెల ట్యాక్స్ డెవల్యూషన్‌ను రాష్ట్రాలకు అడ్వాన్స్‌గా అందించడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో సారి. గతంలో నవంబర్‌లోనూ ఇలా ఆ నెలవారీగా అందించాల్సిన ట్యాక్స్ షేర్‌ను రాష్ట్రాలకు అందించడంతోపాటు అడ్వాన్స్‌గా ఒక నెల ట్యాక్స్ షేర్‌ను అందించింది. నవంబర్‌ 22న తొలిసారి అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ లెక్కన రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించిన అడ్వాన్స్ నిధులు రూ. 95,082 కోట్లుగా ఉన్నది. అంటే, ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయింపులకు అతీతంగా అదనంగా రూ. 95,082 కోట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసినట్టవుతుంది.

గతేడాది ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించే జీఎస్టీ నిధులు కరోనా కారణంగా మొత్తం అందించలేకపోయిన సంగతి తెలిసిందే. అందుకు బదులు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్‌ల కింద రూ. 1.59 లక్షల కోట్లు విడుదల అయ్యాయి. ఇలా లోన్లు మొదలుకుని.. ట్యాక్స్ డెవల్యూషన్ సకాలంలో పంపిణీ చేయడం.. ఒక్కోసారి అదనంగానూ వాయిదాలు అందించడం వెనుక అసలు ఉద్దేశ్యం.. కరోనా మహమ్మారి వల్ల కలిగిన విధ్వంసాన్ని, తీవ్ర నష్టాన్ని పూడ్చుకుని రాష్ట్రాలు మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టడానికేనని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

ట్యాక్స్ డెవల్యూషన్ కింద అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు అందవు. ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా.. అందాల్సిన వాటాలకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ ఓ నిర్ధారణ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలకు లోబడే కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను సాధారణంగా రాష్ట్రాలకు కేటాయిస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలకు గాను కేంద్రప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు విడుదల చేయబోతున్న సొమ్మునూ పేర్కొంది.

ఈ నెలకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించనున్న రూ. 95,082 కోట్ల నిధుల్లో తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణలకు కలిపి సుమారు 5,840 కోట్లు అందుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. రెగ్యులర్‌గా అందించే ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 1,923.98 కోట్లు, అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 1,923.98కోట్లు.. అంటే మొత్తం 3,847.96 కోట్లు అందుకోనుంది. కాగా, తెలంగాణ రాష్ట్రం.. రెగ్యులర్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 999.31 కోట్లు, అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ. 999.31 కోట్లు.. మొత్తం కలిపి ఈ నెలకుగాను రూ. 1,998.62 కోట్లు పొందనుంది.

కాగా, ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 17,056.56 కోట్లు, బిహార్ రాష్ట్రం రూ. 9,563.30 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రం 7,463. 92 కోట్లు పొందనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios