న్యూఢిల్లీ:జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ యూటీల ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకొన్నారు.రూ. 520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి జవదేకర్  మీడియాకు వివరించారు.

పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేబినెట్ ఎన్ఈపీ కింద స్టార్స్ ప్రాజెక్టును ఆమోదించినట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.ఈ ప్రాజెక్టును విద్య, అక్షరాస్యత విభాగం అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాలను కవర్ చేయనుంది.

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సుమారు రూ. 5,718 కోట్లు  సహాయంగా అందించనుందని కేంద్రం ప్రకటించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని  విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

కరోనాకు ముందు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ఆర్ధిక వ్యవస్థ చేరుకొంటుందని ఆయన చెప్పారు.కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు తోమర్, రాజ్ నాథ్ సింగ్ లు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

భూగర్భజలాన్ని సమర్ధవంతంగా వినియోగించుకొనేందుకు వీలుగా కేంద్ర జల్ శక్తి , అస్ట్రేలియాల మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ. 3,874 కోట్లను ముడి చమురు కొనుగోలు కోసం కేటాయింపునకు కేంద్రం ప్రకటించింది.