సొంత కోడలిపైనే వేధింపులకు పాల్పడిన మామ...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 11, Aug 2018, 1:11 PM IST
Uncle Harassment on Daughter In Law
Highlights

కుటుంబ కలహాల కారణంగా సొంత మేనమామే ఓ వివాహితను సోషల్ మీడియా వేధికగా వేధించాడు.  సోషల్ మీడియాలో పెట్టిన తన ఫోటోలకు అసభ్యకరమైన కామెంట్లు వస్తుండటంతో బెంగళూరుకు చెందిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమె మేనమామే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. 

కర్ణాటక రాజధాని బెంగళూరు కు చెందిన ఓ 28 ఏళ్ల వివాహిత తన భర్తతో కలిసి హల్సార్ ప్రాంతంలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె పెళ్లి జరగడంతో తన భర్తతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలకు ఎవరో వ్యక్తి అసభ్యకర కామెంట్స్ పెడుతుండటాన్ని బాధిత మహిళ గుర్తించింది. దీంతో ఆమె ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాధు చేసింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు ప్రారంభించారు. అసభ్య కామెంట్స్ వస్తున్న ఐడీని ట్రేస్ చేయగా అసలు నిందితుడు దొరికాడు. అయితే అతడు మరెవరో కాదు స్వయానా బాధిత యువతికి మేనమామ. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఐపీసీ 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.   
 
loader