Asianet News TeluguAsianet News Telugu

నాటి రాముడు సీతకు స్వర్ణ విగ్రహం.. నేటి రాముడు భార్యకు మైనపు విగ్రహం

ఆ ఇంటి గృహ ప్రవేశంలో తన భార్యలేని లోటు ఉండకూడదని అనుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందనేలా.. వెంటనే భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి మురిసిపోయాడు.

Unable to bear a housewarming without his late wife, Karnataka man installs her statue
Author
Hyderabad, First Published Aug 11, 2020, 10:15 AM IST

ఆ నాడు రాముడు తన పక్కన భార్య లేకపోవడంతో... స్వర్ణ సీతను ప్రతిష్టించి యాగం చేశాడు. ఈ నాటి రాముడికి భార్య రోడ్డు ప్రమాదం లో దూరమైంది. ఆ బాధను తీర్చుకోవడానికి.. తన కొత్త ఇంట్లో భార్య మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. 

చాలా మంది భార్య చనిపోతే.. ఎప్పుడెప్పుడు రెండో పెళ్లి చేసుకుందామా అని ఎదురుచూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి కాలంలోనూ చనిపోయిన భార్యను ఇంకా మదిలో నింపుకొని.., ఆ ప్రేమను మైనపు విగ్రహం ద్వారా లోకానికి తెలియజేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా కి భార్య, ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు ఉన్నారు. కాగా.. ఓ రోడ్డు ప్రమాదంలో వారి గృహలక్ష్మి కన్నుమూసింది. కాగా.. భార్య మృతితో శ్రీనివాస్ గుప్తా చాలా కుంగిపోయారు. కాగా.. ఇటీవల ఆయన నూతన ఇంటిని కొనుగోలుచేశారు.

ఆ ఇంటి గృహ ప్రవేశంలో తన భార్యలేని లోటు ఉండకూడదని అనుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందనేలా.. వెంటనే భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి మురిసిపోయాడు.

కాగా... ఆమె విగ్రహాన్ని చూసి.. ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే.. నిజంగా మనిషి కూర్చున్నట్లుగానే ఆ విగ్రహం ఉండటం విశేషం. ఇంకేముంది కుటుంబసభ్యులు అందరూ కూడా దాన్ని చూసి మురిసిపోయారు. ఆ మైనపు విగ్రహంతో ఫోటోలు దిగి సంతోషించారు. కాగా.. వారి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. అతనికి కలియుగ రాముడు అంటూ నెటిజన్లు కీర్తించడం గమనార్హం.
 

Follow Us:
Download App:
  • android
  • ios