ఉక్రెయిన్ లో నివసిస్తున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. మూడు రోజుల పాటు ఇండియా - ఉక్రెయిన్ దేశాల మధ్య మూడు విమనాలు నడపనున్నారు. ఈ నెల 22. 24,26 తేదీల్లో ఈ సర్వీసులు కొనసాగనున్నాయి.
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మధ్య నెలకొన్నఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులను మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా (air india) విమానాలు నడపనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
ఫిబ్రవరి 22, 24, 26 తేదీలలో ఇండియా-ఉక్రెయిన్ (బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం) మధ్య 3 విమానాలను నడుపుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎయిర్ ఇండియా బుకింగ్ కార్యాలయాలు (booking office), వెబ్‌సైట్ (web sites), కాల్ సెంటర్ (call centers), ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల (authorised travel agents) ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ ఫిబ్రవరి 22, 24, 26 తేదీలలో భారతదేశం నుంచి ఉక్రెయిన్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయం (Boryspil International Airport) మధ్య మూడు విమానాలను నడపాలని నిర్ణయించకున్నాం. ఎయిరిండియా బుకింగ్ కార్యాలయాలు, వెబ్‌సైట్, కాల్ సెంటర్ మరియు ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ ఓపెన్స్ అయ్యాయి ’’ అని పేర్కొంది.
రష్యా (russia) .. ఉక్రెయిన్ (Ukraine)తో తన సరిహద్దుకు సమీపంలో దాదాపు 1 లక్ష మంది సైనికులను ఉంచింది, నౌకాదళ విన్యాసాల కోసం నల్ల సముద్రానికి యుద్ధనౌకలను పంపడంతో పాటు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని NATO దేశాలలో ఆందోళనలను రేకెత్తించింది. అయితే ఉక్రెయిన్‌పై దాడికి యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా ఖండించింది.
ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు సమాచారం, సహాయం అందించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలొ తూర్పు యూరోపియన్ (east european) దేశంలోని భారతీయుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ (help line) ను కూడా ఏర్పాటు చేసింది.
ఇది ఇలా ఉండగా.. నిన్న జరిగిన యూనిటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (united nations security council) సమావేశంలో ఇండియా ఉక్రెయిన్ - రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులపై తన వాధనను వినిపించింది. ఈ కౌన్సిల్ లో యూఎన్ వో (uno)భారత ప్రతినిధి ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి (ts tirumurthi) మాట్లాడుతూ.. ఆ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులను చిత్తశుద్ధితో, నిరంతర దౌత్య ప్రయత్నాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. భారత్ ఇదే కోరకుంటుందని అన్నారు.
‘‘ఈ ప్రాంతం వెలుపల దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించేందుకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ సూచిస్తోంది.’’ అని చెప్పారు. 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని అన్నారు. భారత జాతీయుల శ్రేయస్సు విషయం తమకు చాలా ముఖ్యమని తిరుమూర్తి అన్నారు.
