రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం బ్రిటిన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం ఆయన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం బ్రిటిన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయనకు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవద్రత్, సీఎం భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. గుజరాతీ సంప్రదాయ సంగీతం వాయిస్తూ, నృత్యాలను ప్రదర్శిస్తున్న బృందాలు ఆయనుకు స్వాగతం పలికాయి. ఆపై నగరంలోని నాలుగు కిలోమీటర్ల మేర రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ మహాత్మా గాంధీ ప్రసిద్ధ చరఖాను బోనిస్ జాన్సన్ తిప్పారు. ఆయన చరఖా ముందుకూర్చొని తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు ఆయనకు ఎలా తప్పాలో మార్గనిర్దేశం చేశారు. 

‘‘మహత్మా గాంధీ ఆశ్రమానికి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచాన్ని మంచిగా మార్చడానికి ఆయన సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలను ఎలా సమీకరించాడో అర్థం చేసుకున్నాను’’ అని బోరిస్ జాన్సన్ విజిటర్స్ బుక్‌లో రాశారు.

Scroll to load tweet…

ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్‌.. సబరతి ఆశ్రమం నుంచి బహుమతులు అందుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్‌ అడ్మిరల్‌ కూతురు మడేలిన్‌ స్లేడ్‌(మీరాబెన్‌) రచించిన The Spirit's Pilgrimage ప్రధాని బోరిస్ జాన్సన్కు సబర్మతి ఆశ్రమం వారు బహుమతిగా అందజేశారు. అలాగే గాంధీ రాసిన మొదటి పుస్తకాలలో ఒకటైన 'గైడ్ టు లండన్' కాపీని కూడా ఆయనకు అందజేశారు.