జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. 

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. అనంతనాగ్‌లోని పోష్ క్రీరి ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్టుగా కశ్మీర్ జోన్ పోలీసు విభాగం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని చెప్పింది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతాయని.. మరిన్ని వివరాలు తర్వాత అందజేయబడతాయని పేర్కొంది. 

Scroll to load tweet…