అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఇద్దరు టీనేజీ కుర్రాళ్లు కన్నేశారు. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు టీనేజీ కుర్రాళ్లు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  తమిళనాడు రాష్ట్రం తుటికోరిన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 8ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా.. పోలీసులు దర్యాప్తులో ఇద్దరు టీనేజీ కురాళ్లు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకయ్యారు.

కాగా. పోలీసులు నిందితులు ముత్తీశ్వరన్(19), నందీశ్వరన్(19) లను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సెక్షన్ 302, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు గాను సెక్షన్ 201, పోక్సో చట్టం కింద వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. బాలిక షెడ్యూల్డ్ కులానికి చెందిన చిన్నారిగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు కూడా అదే కులానికి చెందిన వారు కాగా... షెడ్యూల్ కాస్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మరో నిందితుడు నందీశ్వరన్ మాత్రం వేరే కులానికి చెందిన వాడుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.