Asianet News TeluguAsianet News Telugu

రెండు శాతం ప్ర‌జ‌లే మాస్కు ధరిస్తున్నారట.. వెల్లడించిన లోక‌ల్ స‌ర్కిల్స్‌ స‌ర్వే

దేశంలో కేవలం 2 శాతం మంది మాత్రమే బాధ్యత్యాయుతంగా మాస్క్ ధరిస్తున్నారని లోకల్ సర్కిల్స్ సర్వే సంస్థ వెల్లడించింది. 

Two percent of people wear masks, according to a local Circle survey.
Author
Hyderabad, First Published Dec 5, 2021, 1:04 PM IST

ఓ వైపు దేశంలో ఓమ్రికాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో నాలుగు కొత్త వేరియంట్ కేసులు గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. కానీ మస్కు ధ‌రించ‌డంలో అంద‌రూ నిర్ల‌క్ష్యం వహిస్తున్నారు. కేవ‌లం రెండు శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే స‌రిగ్గా మాస్కులు ధ‌రించి, నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఈ విష‌యాన్ని లోక‌ల్ స‌ర్కిల్స్ సర్వే నిర్ధారించింది. ఈ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

మాస్క్ ధ‌రించ‌డంలో పెరిగిన నిర్ల‌క్ష్యం..
మాస్క్ ధ‌రించ‌డంలో ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం పెరిగింద‌ని ఈ స‌ర్వే తేట‌తెల్లం చేసింది. క‌రోనా మొద‌టి వేవ్, రెండో వేవ్ వ‌చ్చి వెళ్లిన త‌రువాత కూడా ప్ర‌జ‌లు ఇలా నిర్ల‌క్ష్యంగా ఉంటున్నార‌ని తెలిపింది. ఓమ్రికాన్ వేరియంట్ పెరుగుతోంద‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ సంస్థ స‌ర్వే నిర్వహించింది. భార‌తదేశంలోని 364 జిల్లాలో ఈ స‌ర్వే నిర్వ‌హించిన‌ట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ స‌ర్వేలో 25,000 మంది అభిప్రాయాల‌ను సేక‌రించామ‌ని చెప్పింది. మాస్కు ధ‌రించ‌డంలో మీ ప్రాంతంలో ఎంత మంది బాధ్య‌తాయుతంగా ఉంటున్నార‌ని ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిని ప్ర‌శ్నించామ‌ని తెలిపింది.
ఈ ప్ర‌శ్న‌ల‌కు చాలా ఆస‌క్తిదాయ‌క‌మైన స‌మాధానాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 30 శాతం మంది త‌మ ప్రాంతంలో చాలా మంది బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ ధ‌రించ‌డం లేద‌ని తెలిపారు కేవ‌లం 2 శాతం మంది ప్ర‌జ‌లు మాస్క్ త‌ప్ప‌ని స‌రిగా ధ‌రిస్తున్నార‌ని చెప్పారు. మాస్క్ ధ‌రించ‌డం ప‌ట్ల వారు బాధ్య‌త‌గా ఉంటున్నార‌ని వెల్ల‌డించారు. 
మీ ప్రాంతంలో ప్ర‌జ‌లు మాస్కు వెంట తీసుకెళ్ల‌డం అలావాటు చేసుకున్నారా అని ప్ర‌శ్నించ‌గా.. 34 శాతం మంది త‌మ ప్రాంతంలో ప్ర‌జ‌లు మాస్క్ వెంట తీసుకెళ్ల‌డం లేద‌ని చెప్పారు. మాస్క్‌ను వెంట ఉంచుకున్న‌ప్ప‌టికీ చాలా మంది ధ‌రించ‌డం లేద‌ని మ‌రో 23 శాతం మంది జ‌వాబు చెప్పారు. చాలా మందికి మాస్క్ ఎలా ధ‌రించాలో ఇప్ప‌టికీ తెలియ‌ద‌ని 38 శాతం ప్ర‌జ‌లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ స‌ర్వేలో 69 శాతం పురుషులు పాల్గొన‌గా.. 31 శాతం మ‌హిళ‌లు పాల్గొన్నారు. 

https://telugu.asianetnews.com/international/who-deploys-team-in-south-africa-to-tackle-omicron-variant-r3j0x3
ఈ స‌ర్వేలో  41 శాతం మంది టైర్ 1 న‌గ‌రాల నుంచి, 30 శాతం టైర్ 2 న‌గ‌రాల నుంచి, మిగిలిన 29 శాతం టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల నుంచి పాల్గొన్నార‌ని లోక‌ల్ స‌ర్కిల్స్ స‌ర్వే తెలిపింది. మాస్క్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అవ‌గాహ‌న‌ను తెలుసుకుందామ‌ని ఈస‌ర్వేను ఏప్రిల్ లో నిర్వ‌హించామ‌ని ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు స‌చిన్ త‌పారియా తెలిపారు. ఆ స‌మ‌యంలో 29 శాతం ప్ర‌జ‌లు మాస్క్ నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించార‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ నెల‌లో అది 12 శాతానికి ప‌డి పోయింద‌ని చెప్పారు. న‌వంబ‌ర్ నెల‌ల ఆ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారి 2 శాతానికి ప‌రిమిత‌మ‌య్యింద‌ని తెలిపారు. మాస్కు ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వంపై, స్వ‌చ్ఛంద సేవ సంస్థ‌ల‌పై ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. బ‌ట్ట‌తో చేసిన మాస్కులు క‌రోనా నుంచి కొంత మేర‌కు మాత్ర‌మే ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయ‌ని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios