Asianet News TeluguAsianet News Telugu

పుదుచ్చేరి సీఎంకి షాక్: ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

పాండిచ్చేరి రాజకీయాల్లో కొంత కాలంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు.ఈ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

Two mlas submitted resignation letters to Speaker lns
Author
Pondicherry, First Published Feb 21, 2021, 4:41 PM IST

యానాం: పాండిచ్చేరి రాజకీయాల్లో కొంత కాలంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు.ఈ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే . డీఎంకె ఎమ్మెల్యే కూడ రాజీనామాలు సమర్పించారు.  ఆదివారం నాడు మధ్యాహ్నం ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా స్పీకర్ కు రాజీనామా పత్రాలు సమర్పించారు.పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలున్నాయి.డీఎంకె,ఇండిపెండెంట్ ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 18 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవలనే మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాన్ రాజీనామాలు సమర్పించారు. వీరిద్దరూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

మాజీ మంత్రి యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కూడ తన ఎమ్మెల్యే పదవికి గత వారం క్రితం రాజీనామా సమర్పించారు. మల్లాడి కృష్ణారావు రాజీనామా చేసిన మరునాడే జాన్ కుమార్ అనే ఎమ్మెల్యే కూడ రాజీనామా చేశారు. 

ఆదివారం నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కూటమి బలం 18 నుండి 12కి పడిపోయింది. మరోవైపు ఎన్నార్ కాంగ్రెస్ కు ఏడుగురు, అన్నాడీఎంకెకు 4,  ముగ్గురు నామినేటేడ్ సభ్యులతో ఆ పార్టీ బలం 3కి చేరుకొంది.  ఈ కూటమి బలం 14కి చేరింది.రేపు సాయంత్రం ఐదు గంటలకు పుదుచ్చేరి అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios