ఇద్దరు అమ్మాయిలను మభ్యపెట్టి ఓ ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పెళ్లి, చదువుల పేరుతో వారిని నమ్మించి ఊరినుంచి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారు. 

జైపూర్ : Jaipurలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ధన్‌బాద్‌కు చెందిన ఇద్దరు బాలికలపై జైపూర్‌లో ఇద్దరు వ్యక్తులు molestationకి పాల్పడ్డారు. బాలికలు ఇద్దరిని ఓ వ్యక్తి, అతని బావ కలిసి అత్యాచారం చేశారు. దీనికోసం వీరు ఆ బాలికలను పెళ్లి, చదువుల సాకుతో మభ్యపెట్టారు. వారిద్దరిని బాధితులను జైపూర్‌కు రప్పించారు. అర్మాన్, ఆరిఫ్(బావమరిది)గా గుర్తించబడిన నిందితులు ఇద్దరూ బాధితులు ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నారు.

రంజాన్ సందర్భంగా అర్మాన్ వారి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందామనే సాకుతో చిన్న కుమార్తెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కుమార్తెలు కనిపించకుండా పోవడంతో బాధితురాలి తల్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అందులో అర్మాన్ చిన్న కుమార్తెకు పెళ్లి చేస్తానని హామీ ఇచ్చి ఏప్రిల్ 7న తన కుమార్తెలను జైపూర్‌కు తీసుకెళ్లినట్లు వెల్లడించింది.

చెల్లెలితో పాటు అక్క చదువుకు కూడా సహాయం చేస్తానంటూ నిందితులు అక్కను కూడా ప్రలోభపెట్టినట్లు ఆమె వెల్లడించింది. అయితే రోజుల తరబడి కూతుళ్లిద్దరూ రాకపోవడంతో తల్లి ఝరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు బాలికలు ఇద్దరు అన్వేషణ ప్రారంభించినప్పుడు, అర్మాన్ తన బావమరిది సహాయంతో అమ్మాయిలిద్దరినీ జైపూర్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది.

విచారణలో, పోలీసులు ఆరిఫ్‌ను పట్టుకున్నారు, అతను వారిని జైపూర్‌కు తీసుకెళ్లాడు, అక్కడ అర్మాన్‌తో ఆ అమ్మాయిలు ఇద్దరూ ఉండడాన్ని గుర్తించారు. ఏప్రిల్ 12న, బాధితులిద్దరూ ధన్‌బాద్‌కు తిరిగి వచ్చారు. అక్కడ అర్మాన్ కుటుంబం వారి కొడుకు బాధితురాలితో వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.

ఆ తర్వాత, అర్మాన్ తమను జైపూర్ తీసుకెళ్లి అత్యాచారం చేశాడని అక్కాచెల్లెళ్లిద్దరూ ఆరోపించారు. అంతేకాదు విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని అర్మాన్, అతని బావ బెదిరించారని వారు వెల్లడించారు.పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారని ఝరియా ఎస్‌హెచ్‌ఓ పంకజ్ కుమార్ ఝా తెలిపారు.

ఇదిలా ఉండగా, తనతో పాటు చదువుకుంటున్నాడని, దారి మధ్యలో తోడుంటాడని నమ్మిన బాలికను తోడుగా వచ్చిన బాలుడే మోసం చేశాడు. ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. minor girlపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరినీ బెదిరించి ఆ మైనర్ బాలికపై rapeకి ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే సోమవారంనాడు పదో తరగతి పరీక్ష రాసి స్నేహితుడితో కలిసి బాలిక గ్రామానికి వస్తుంది.. గ్రామ సమీపంలోకి రాగానే బాలికపై ఆ స్నేహితుడు అత్యాచారం చేశాడు. వీరిని వెనక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు బాలికను ఆమె స్నేహితుని పట్టుకున్నారు.

మీ తతంగాన్నంతా వీడియో తీశామని.. తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ కూడా జరిగింది. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఇంతలో స్నేహితుడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి... గ్రామస్తులను పిలుచుకుని వచ్చాడు. గ్రామస్తులను చూసి ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. బాగేపల్లి పోలీసులు స్నేహితుడితో పాటు పరారీలో ఉన్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.