యూపీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపీ కాల్పులు జరిపిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

లక్నో: హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisi కాన్వాయ్ పై వు Firing జరిపిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా Uttar Pradesh పోలీసులు శుక్రవారం నాడు ప్రకటించారు. కాల్పులు జరిపిన వెంటనే ఒకరిని అదుపులోకి తీసుకొన్నారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి వెళ్లున్న సమయంలో అసదుద్దీన్ ఓవైసీపీ కాన్వాయ్ పై మీరట్ లోని కితౌద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. 

తమ మనో భావాలను కించపర్చినందుకు ఓవైసీపీపై కాల్పులకు దిగినట్టుగా నిందితులు చెప్పారని ఎస్పీ వివరించారు.తన కాన్వాయ్ పై దాడి ఘటనకు సంబంధించి ఓవైసీ పార్లమెంట్ లో ప్రస్తావించనున్నారు. మరో వైపు ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఆయన ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలిపారు. మరో వైపు అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా గురువారం నాడు అర్దరాత్రి ఢిల్లీకి చేరుకొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలోని పిల్ధువా సమీపంలోని ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద సాయంత్రం అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి.

గౌతమ్ బుద్ద్ నగర్ లోని బాదల్ పూర్ నివాసి Sachin Sharma ను సంఘటన స్థలంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి లైసెన్స్ లేని Pistol ను స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు నిందితులు ఉపయోగించిన తెల్లటి ఆల్టో Carను కూడా స్వాధీనం చేసుకొన్నారు.సచిన్ శర్మ తన ఫేస్‌బుక్ ఖాతాలో బీజేపీ కార్యకర్తలకు ఫోజులిచ్చాడు. హరిద్వార్ లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఇటీవల అరెస్టైన యతి నర్సింహనంద్ వీడియోను కూడా సచిన్ శర్మ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఎంపీ కాన్వాయ్ పై కాల్పులు జరిగిన విషయం తెలియడంతో వేగంగా చర్యలు తీసుకొన్నామని ఎస్పీ మీడియాకు తెలిపారు.

కాల్పులు జరిగిన తర్వాత తన వాహనం ఫోటోను అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. తాము కిథోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టుగా అసద్ మీడియాకు తెలిపారు. పిల్టువా టోల్ గేట్ వద్దకు తాము చేరుకొన్న సమయంలో తమ వాహనం వేగం తగ్గిందని అసద్ చెప్పారు. అయితే ఆ సమయంలో తనకు శబ్దం విన్పించిందన్నారు. వరుసగా రెండు సార్లు శబ్దాలు విన్పించిన తర్వాత కారు నడుపుతున్న తన స్నేహితుడు తమపై దాడి జరుగుతుందని చెప్పాడన్నారు. వెంటనే కారు వేగాన్ని పెంచాడని అసదుద్దీన్ ఓవైసీ మీడియాకు తెలిపారు.

మూడు లేదా నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా భావిస్తున్నానని చెప్పారు. కారుకు ఎడమ, కుడి వైపున కూడా రంద్రాలు పడిన విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ మీడియాకు చెప్పారు. కారు టైర్ పంక్చర్ అయిందన్నారు. ఫ్లై ఓవర్ పై కారును ఆపి మరో కారులో తాను ఢిల్లీకి వచ్చినట్టుగా ఓవైసీ చెప్పారు. తమ పార్టీ నేత మాజీద్ ప్రయాణీస్తున్న కారు తన కారు వెనుకే ఉందన్నారు. ఈ కారు డ్రైవర్ కాల్పులు జరిపిన వ్యక్తిని ఢీకొట్టాడన్నారు. దీంతో అతను కిందపడిపోయినట్టుగా ఓవైసీ చెప్పారు. తెల్లటి జాకెట్ ధరించిన వ్యక్తి ఫార్చూనర్ పై కాల్పులు జరిపాడని అసద్ తెలిపారు.