Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ న్యూస్: ట్విట్టర్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఫేక్ ఖాతాలు, నకిలీ వార్తల కంటెంట్ ను నియంత్రించేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు  శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్‌కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Twitter Centre Get Supreme Court Notice On Mechanism To Check Fake News lns
Author
new delhi, First Published Feb 12, 2021, 2:19 PM IST

న్యూఢిల్లీ: ఫేక్ ఖాతాలు, నకిలీ వార్తల కంటెంట్ ను నియంత్రించేలా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు  శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్‌కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫేక్‌న్యూస్‌పై చర్యలు తీసుకోకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖుల పేరిట వందలాది మంది నకిలీ ట్విట్టర్,ఫేస్‌బుక్ ఖాతాలున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత వినిత్ గోయెంకా గత ఏడాది మే మాసంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నాడు విచారణ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోషల్ మీడియా నియంత్రణ కోరుతూ పెండింగ్ లో ఉన్న పిటిషన్లకు దీన్ని ట్యాగ్ చేయాలని ఆదేశించింది. 

ట్విట్టర్ తో సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఫేక్ న్యూస్, విద్వేష సందేశాలు, దేశద్రోహ సందేశాలపై నిఘా కోసం ఓ విధానాన్ని రూపొందించాలని  బీజేపీ నేత వినీత్ గోయెంకా గత ఏడాది మే మాసంలో పిటిషన్ దాఖలు చేశారు.

మరోవైపు రైతు ఉద్యమం నేపథ్యంలో పలువురు నకిలీ వార్తల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కొన్ని ట్విట్టర్ ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం ట్విట్టర్ ను కోరింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios