విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌కు చెందిన అర్షద్ రెహ్మానీ అనే వ్యక్తి మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత బాలిక సోదరికి అరబిక్ నేర్పించడానికి ఆమె ఇంటికి వెళ్లేవాడు.

Also Read:అనాథ ఆశ్రమంలో బాలికపై అత్యాచారం

ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.

దీనిపై ఖమర్ధిన్ ఎస్‌హెచ్‌వో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.