పంజాబ్, హర్యానాలో ఓ ట్యూషన్ టీచర్ టీనేజ్ విద్యార్థితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా కారణంగా అన్నీ ఆన్ లైన్ క్లాసులు అయిపోయాయి. ఆన్ లైన్ లో క్లాసులు నేర్చుకునేవాళ్లు కొందరైతే.. ట్యూషన్ టీచర్లద్వారా పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నావారు మరికొందరు.

ఇదే ఆ తల్లిదండ్రుల కొంపముంచింది. వివరాల్లోకి వెడితే.. పానిపట్ కు చెందిన ఓ కుటుంబం, తమ 17యేళ్ల కొడుకుకు ట్యూషన్ చెప్పడానికి 20యేళ్ల వయసున్న మహిళా టీచర్ ను నియమించారు. 

గత మూడు నెలలుగా ఆమె ప్రతిరోజూ ఇంటికి వచ్చి అతడికి ట్యూషన్ చెబుతుంది. రోజూ నాలుగు గంటలపాటు ట్యూషన్ సాగుతుంది. ఈ క్రమంలో మే 29న ఆ అబ్బాయి ఇంటికి దగ్గర్లో ఉన్న దేస్రాజ్ కాలనీలో ఉండే ట్యూషన్ టీచర్ ఇంటికి వెడుతున్నానని చెప్పి వెళ్లాడు.

రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. కొడుకుకు ఫోన్ చేస్తే స్విఛాప్ వస్తుంది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు కంగారుగా ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కొడుకు కోసం వాకబు చేస్తే.. తమ కొడుకే కాదు వాళ్ల కూతురైన సదరు టీచర్ కూడా కనిపించడం లేదని తెలిసింది.

సహజీవనం : గదిలో బంధించి అత్యాచారం, చిత్రహింసలు.. ఆపై......

టీచర్ తల్లిదండ్రులు తమ కూతురు కూడా కనిపించడంలేదంటూ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ టీచర్ మీద మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ టీచర్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశామని, వారికోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి రాణా ప్రతాప్ తెలిపారు. అయితే ఆ టీచర్ కు ఇదివరకే పెళ్లవగా విడాకులు కూడా తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే వీరిద్దరూ ఇంట్లోనుంచి వెళ్లేటప్పుడు ఎలాంటి విలువైన వస్తువులు తీసుకువెళ్లలేదని పోలీసులు తెలిపారు.