తన వద్దకు మూడేళ్ల నుంచి ట్యూషన్ కు వచ్చే ఓ స్టూడెంట్ ను గొంతు కోసి చంపాడు ఓ టీచర్. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. 

రాజస్థాన్ (rajasthan)లోని కోటా ప్రాంతంలో ఓ ట్యూషన్ టీచర్ (tuition teacher) దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చే ఓ 15 ఏళ్ల విద్యార్థిని గొంతు కోసి చంపేశాడు. అనంత‌రం అత‌డు ప‌రార‌య్యాడు. ఎట్ట‌కేల‌కు పోలీసులు నేడు ఆ టీచ‌ర్ ను అరెస్టు చేశారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాజ‌స్థాన్ (rajasthan) లోని కోటాని రాంపూర్ సిటీ పోలీసు స్టేష‌న్ (Rampur City police station) ప‌రిధిలో 28 ఏళ్ల గౌర‌వ్ జైన్ (Gaurav Jain) ట్యూష‌న్ లు చెబుతూ ఉంటాడు. అయితే త‌న ఇంటి వ‌ద్ద‌కు ట్యూష‌న్ కు వ‌చ్చే 15 ఏళ్ల బాలిక‌ను ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన గొంతు కోసి హ‌త్య చేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. అయితే బాలిక నిందితుడి ఇంట్లో ఉన్న‌ప్పుడు మెడకు ఉచ్చు, చేతులు కట్టేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీనిని గ‌మ‌నించిన స్థానికులు ఆమెను హాస్పిట‌ల్ కు త‌ర‌లిస్తుండ‌గానే ప‌రిస్థితి విష‌మించి మృతి చెందింది. 

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. నిందితుడిని వెత‌క‌డం ప్రారంభించారు. అత‌డు క‌నిపించ‌కుండా ఉండే సరికి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు మొద‌ట‌గా భావించారు. ఈ అనుమానంతో నే చంబల్ (Chambal) నది, ఇతర కాలువల్లో గాలించారు. అయినా అత‌డి జాడ దొర‌క‌లేదు. దీంతో 30 మంది పోలీసులు బృందాలుగా ఏర్ప‌డి నిందితుడి కోసం వెత‌క‌డం మొద‌లు పెట్టారు. అయితే అత‌డు హ‌ర్యానా (haryana) రాష్ట్రంలోని గురుగ్రామ్ (Gurugram)లోని అత‌డి సోద‌రి ఇంట్లో ఉంటార‌ని స‌మాచారం రావ‌డంతో అక్క‌డికి పోలీసులు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. 

బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై గ‌తంలోనే ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బాధితురాలికి ఇంటి స‌మీపంలోనే ఉంటాడ‌ని, మూడు సంవ‌త్స‌రాలుగా బాలిక‌కు ట్యూష‌న్ చెబుతున్నార‌ని పోలీసులు తెలిపారు.