మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ట్రక్ డ్రైవర్ ఓ కుక్క పిల్లను ఎక్కించాడని చితక బాదారు. రోడ్డుపై వెళ్తున్న ట్రక్ అనుకోకుండా పప్పీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ఆ డ్రైవర్ ఇంటికి వచ్చీ మరి దాడి చేశారు. విచక్షణా రహితంగా దాడి చేసిన తర్వాత ఆ డ్రైవర్ ఉరి తాడుకు వేళాడుతూ కనిపించాడు. ఆయనను కొట్టిన వారే ఉరి వేసి చంపేశారని ఆ డ్రైవర్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా, అది ప్రాథమికంగా చూస్తే ఆత్మహత్య లాగే ఉన్నదని పోలీసులు చెబుతున్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ దుర్ఘటన జరిగింది. రెవా జిల్లాలో ఓ ట్రక్ డ్రైవర్ (Truck Driver) కుక్క పిల్లను ఢీకొట్టాడు. ఆ కుక్క పిల్ల(Pet Dog) అక్కడికక్కడే మరణించింది. దీంతో కొందరు ఆ డ్రైవర్‌ను విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఆ డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన నైగడీ పోలీసు స్టేషన్ పరిధిలోని లంగర్ పుర్వా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడిని రాజ్ కరణ్ విశ్వకర్మగా గుర్తించినట్టు అదనపు ఎస్పీ శివకుమార్ వర్మ వివరించారు.
రాజ్ కరణ్ విశ్వకర్మ అనే డ్రైవర్ తన ట్రక్‌పై పని నిమిత్తం వేగంగా వెళ్తున్నాడు. కానీ, అనుకోకుండా ఓ కుక్క పిల్ల ఆకస్మికంగా దారిపైకి వచ్చింది. ఆ కుక్క పిల్లలను డ్రైవర్ తప్పించలేకపోయాడు. దీంతో ఆ ట్రక్ టైర్లు కుక్క పిల్లపై నుంచి దూసుకెళ్లాయి. ఈ ఘటన కొందరిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. కుక్క పిల్ల మరణించినందుకు ఏకంగా ఆ డ్రైవర్‌నే చితక బాదాలనేంతగా వారిలో కోపాన్ని రగిలించింది. దీంతో చోటు, సందీప్ పటేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ డ్రైవర్ రాజ్ కరణ్ విశ్వకర్మ ఇంటి ఆచూకీని వెతికి మరీ పట్టుకున్నారు. డ్రైవర్ ఇంటికి చోటు, సందీప్ పటేల్ వెళ్లి దాడి చేశారు. ఆ దాడి తర్వాత రాజ్ కరణ్ విశ్వకర్మ ఉరి తాడుకు వేళాడుతూ కనిపించాడని అదనపు ఎస్పీ శివ కుమార్ వర్మ తెలిపారు.
డ్రైవర్ రాజ్ కరణ్ విశ్వకర్మ కుటుంబీకులు ఆయనది ఆత్మహత్య కాదని వాదిస్తున్నట్టు అదనపు ఎస్పీ తెలిపారు. రాజ్ కరణ్ విశ్వకర్మను కొందరు వచ్చి దాడి చేశారని, వారే ఆయనను ఉరి వేసి చంపేశారని ఆరోపిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితులనూ వెతికి పట్టుకున్నారు. వారిని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రాథమికంగా చూస్తే రాజ్ కరణ్ విశ్వకర్మది ఆత్మహత్యలాగే కనిపిస్తున్నదని వివరించారు.
ఇదిలా ఉండగా గతనెలలో దారుణం జరిగింది. తను ప్రేమగా పెంచుకున్న శునకానికి ‘సోను’ అని పేరు పెట్టడమే ఆ మహిళలకు శాపంగా మారింది. ఆ పేరు పెడతావా.. అంటూ పొరుగింటి వారు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భావ్ నగర్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన నీతా బెన్ సర్వాయియా (35) తాను పెంచుకుంటున్న Pet Dogకి ‘సోను’ అని పేరు పెట్టారు. అయితే ఈ విషయంపై ఆగ్రహించిన Neighbours.. మంగళవారం నీతా బెన్ ఒంటరిగా ఉండటాన్ని గమనించి వారింట్లోకి చొరబడ్డారు.
తన భార్య ముద్దు పేరు ‘Sonu’ అని.. ఆ పేరు కుక్కకు ఎలా పెడతారు? అని సురాభాయ్ భర్వాద్ అనే పొరుగింటి వ్యక్తిని నీతాబెన్ తో వాగ్వాదానికి దిగాడు. ఆమె kitchenలోకి వెళ్లగానే వెంబడించిన ముగ్గురు వ్యక్తులు.. అక్కడున్న Kerosene డబ్బాను తీసుకుని ఆమెపై పోసి నిప్పంటించారు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఆమె కేకలతో ఇంట్లోకి వచ్చిన స్థానికులు.. మంటలను ఆర్పి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో భావ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.
