అవిశ్వాస చర్చలో పాల్గొంటాం, కానీ ఓటింగ్ లో మాత్రం....: టీఆర్ఎస్ ఎంపీలు

TRS MPs Meeting to Discuss Non Confidence Motion
Highlights

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇపుడు పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తమ హక్కులను కాపాడాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించడానికి అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరో తెలుగు రాష్ట్రం ఈ అవిశ్వాసంపై ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. పార్లమెంట్ లో ఇవాళ జరిగే పరిణామాలను పరిశీలించి సందర్భాన్ని బట్టి వ్యవహరించాలని తెలంగాణ ఎంపీలు భావిస్తున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సమావేశమయ్యారు. డిల్లీలో లోక్ సభ టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి ఇంట్లో  ఎంపీలంతా సమావేశం జరిగింది.  అయితే సీఎం కేసీఆర్ కూడా ఇవాళ సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు పోన్ లోనే దిశానిర్ధేశం చేశారు.

చివరకు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనాలని ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన తొమ్మిది నిమిషాల సమయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉపయోగించాలని నిర్ణయించారు. విభజన చట్టంలోని హామీలు, కాళేశ్వరానికి జాతీయ హోదా తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.

అయితే ఈ అవిశ్వాస పరీక్ష సందర్భంగా జరిగే ఓటింగ్ గురించి మాత్రం టీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఓటింగ్ సందర్భంలో సభలోని పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఎంపీలు తెలిపారు. అయితే ఓటింగ్ లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ నుండి ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దాని ప్రకారమే వారు నడుచుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కేకే, సంతోష్, కవిత, బాల్క సుమన్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, సీతారాం నాయక్, మల్లారెడ్డి, బండా ప్రకాష్, లింగయ్యయాదవ్ పాల్గొన్నారు.

loader