Asianet News TeluguAsianet News Telugu

Diamond: రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయిన గ‌ని కార్మికుడు!

ములాయం సింగ్ ఓ గిరిజ‌న కార్మికుడి అదృష్టం వ‌రించింది. రాత్రికి రాత్రే ల‌క్షాది కారిగా మారాడు.  సోమవారం మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా రూ. 50 లక్షలకు పైగా విలువైన 13 క్యారెట్ల వజ్రం బయటపడింది. దీంతో అతని తలరాతే మారిపోయింది.
 

Tribal labourer finds diamond worth Rs 60 lakh in famous Panna mines in MP
Author
Hyderabad, First Published Dec 8, 2021, 2:14 PM IST

Diamond: అదృష్టం ఎవ‌రిని ఎలా వ‌రిస్తోందో చెప్ప‌డం క‌ష్టం. ఓ సాధార‌ణ కూలీకి అదృష్టం క‌లిసి వ‌చ్చి.. ఎవ్వ‌రూ ఊహించిన విధంగా.. రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయ్యాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ములాయం సింగ్ అనే గిరిజన కూలీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని గ‌నుల్లో పనిచేస్తూ.. త‌న భార్య పిల్ల‌ల‌తో జీవ‌నం సాగిస్తోన్నాడు. చాలిచాల‌ని డ‌బ్బుల‌తో త‌న కుటుంబాన్ని గ‌డుపుతున్నాడు. ఎప్ప‌టిలాగే.. గనుల్లోకి వెళ్లాడు. తాను ప‌ని చేస్తోండ‌గా.. మెరుస్తున్న ఓ రాయి బ‌య‌ట ప‌డింది. మిగితా రాళ్ల కంటే భిన్నంగా .. ఉండ‌టంతో త‌నపై అధికారుల‌కు చూపించాడు. వారి ప‌రీక్షించి.. చూడ‌గా.. అది 13 క్యారెట్లు వ‌జ్ర‌మని.. పన్నా డైమండ్ మైన్స్‌లోని నిస్సార గనిలో దొర‌క‌డంతో దాని విలువ దాదాపు రూ. 60 లక్షలపై మాట‌నే అని తెలిపారు.

దీంతో ములాయం సింగ్ ఆనందానికి అవ‌ధుల్లేవు. గ‌తంలో ఆయ‌న రోజు వారీ జీవితం గ‌డువ‌డానికే పోరాటం చేసేవాడు. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా ఉండేది.  అదృష్టశాత్తువు త‌నకి ఈ వ‌జ్రం దొర‌క‌డంతో ఆయ‌న‌ తలరాత మారిపోయింద‌ని భావిస్తోన్నారు అత‌ని ఆత్మీయులు. పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. గతంలో ధూళిలో విలువైన రత్నాన్ని వెలికితీసినప్పుడు చాలా మంది ధనవంతులు అయ్యారు.త‌న‌కి ఇంత‌టీ విలువైన వ‌జ్రం దొర‌క‌డం ఆయ‌నే న‌మ్మ‌లేక‌పోతున్నారు.

Read Also:https://telugu.asianetnews.com/national/with-omicron-third-wave-projected-to-hit-india-by-feb-but-may-be-milder-than-second-says-iit-scientist-r3s7gq 

అదే స‌మ‌యంలో త‌న‌తో వ‌చ్చిన ఇత‌రు కూలీల‌కు కూడా వేర్వేరు బరువుల ఆరు వజ్రాలను కనుగొన్నారని అధికారి తెలిపారు. అందులో రెండు వ‌జ్రాలు వరుసగా 6-క్యారెట్లు, 4-క్యారెట్ల‌ బరువు కలిగి ఉండగా, మరికొన్ని వరుసగా 43, 37, 74 సెంట్లు బరువు కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా…. గతంలో కూడా మధ్యప్రదేశ్‌లో ఓ కూలీకి యాభై లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో వజ్రాల వేటకు వెళ్లిన ఆనందిలాల్ కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించిన విషయం తెలిసిందే.

Read Also: https://telugu.asianetnews.com/international/british-pm-under-fire-over-video-of-staff-joking-about-lockdown-party-r3sd2u

అయితే ప్రభుత్వ గైడ్ లెనెస్స్ ప్ర‌కారం.. వేలంలో వాస్తవ ధరను నిర్ణయిస్తామని చెప్పారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత రైతుకు ఇస్తారు. ఆనందానికి గురైన ములాయం సింగ్ తనకు ఆరుగురు భాగస్వాములు ఉన్నారని, ఆ వజ్రాల మొత్తం విలువ దాదాపు కోటీ రూపాయాల‌పై మాటే. ఆ మొత్తాన్ని వారితో సమానంగా పంచుకుంటానని చెప్పాడు.

వ‌చ్చిన డ‌బ్బును తన పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్నా డైమండ్ రిజర్వ్ ప్రాంతంలో స్థానిక రైతులు, కార్మికులకు వజ్రాలను తవ్వడానికి, వాటిని జిల్లా మైనింగ్ అధికారి వద్ద జమ చేయడానికి భూమిని లీజుకు ఇస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios