కరోనా ఎఫెక్ట్ కారణంగా ఎర్నాకులం చెందిన రాయ్ టూరిజం యాజమాని తన బస్సులను స్క్రాప్ లెక్కన అమ్మివేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కిలో రూ.45 స్క్రాప్ రేటుకు విక్రయించాలని భావించి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఆయన పోస్టును కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ కేరళ (CCOA) షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. కరోనా ప్రభావం ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా పడింది. కొవిడ్ నిబంధనతో బస్సులను నడపలేమని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు బస్సులు నడపలేక, పాత పన్నులు, రుణాలు చెల్లించలేక బస్సులను అమ్ముకుంటున్నారు.
కొచ్చిలోని ఎర్నాకులం చెందిన రాయిసన్ జోసెఫ్.. రాయ్ టూరిజం అనే పేరుతో ట్రావెల్స్ ఆపరేటర్ చేస్తున్నారు. ఆయనకు దాదాపు 20 బస్సులున్నాయి. ట్రావెల్స్ ప్రారంభించిన ఆరంభంలో చాలా బాగా నడిసింది. కానీ కరోనా మహామ్మారి వల్ల ట్రావెల్స్ నిర్వహణ చాలా కష్టతరంగా మారింది. కరోనా ఆంక్షలతో తన బిజినెస్ పూర్తి దెబ్బతిన్నది. ఎంతలా అంటే.. గత 18 నెలల్లో తనకున్న 20 టూరిస్ట్ బస్సులలో 10 విక్రయించే పరిస్థితి తల్లెంది. ఈ తరుణంలో మిగిలి ఉన్న 10 బస్సులను కూడా ఎలాగైతే.. అలాగే.. విక్రయించాలని భావించారు. ఈ నేపథ్యంలో తన బస్సులను కిలో రూ.45 స్క్రాప్ రేటుకు విక్రయించాలనుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఆయన పోస్టును కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ కేరళ (CCOA) షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలో ఆసియానెట్ న్యూస్ బృందం రాయిసన్ జోసెఫ్ ఇంటర్యూ చేసింది. ఈ ఇంటర్యూలో తన కష్టాలను వెల్లడించారు. మహమ్మారి కారణంగా వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలిగిందని, బతకడం చాలా కష్టమవుతుందనీ, ఫైనాన్షియర్లు, ఇతరులకు రుణాలు చెల్లించలేకపోయాననీ తెలిపారు. గత సంవత్సరంలో 20 బస్సుల్లో 10 బస్సులను విక్రయించనని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిల్లో తన దగ్గర ఉన్న బస్సుల్లో 3 బస్సులను స్క్రాప్‌గా విక్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదని ఆసియానెట్ న్యూస్ బృందానికి తెలిపారు. ఒక్కొ బస్సు రోడ్డు మీద తిరగాలంటే.. రూ. 40,000 ట్యాక్స్, రూ. 75,000 ఇన్సూరెన్స్ చెల్లించాలని, ఆ తర్వాత బస్సు రోడ్డుపైకి వస్తుందని తెలిపారు. ఉద్యోగుల నిర్వహణ, తంతో సహా అన్ని ఇతర ఖర్చులు చెల్లించడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వం బస్సు యజమానులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారనీ, కానీ వారి నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆయన అన్నారు.
ఎర్నాకులంలోని రాయ్ టూరిజం యజమాని రాయిసన్ జోసెఫ్, టూరిస్ట్ బస్సు యజమానుల సంఘం అయిన కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ కేరళ (CCOA) ద్వారా భాగస్వామ్యం చేయబడిన FB పోస్ట్‌ను పెట్టారు. తన బస్సులను కిలో రూ.45 స్క్రాప్ రేటుకు విక్రయించాలనుకున్నాడు. మహమ్మారి అతని వ్యాపారానికి అంతరాయం కలిగించిన తరువాత అతను 20 బస్సులను కలిగి ఉన్నాడు మరియు గత సంవత్సరంలో 10 విక్రయించాడు. గత వారం చివరి నాలుగు రోజుల్లో మూడు టూరిస్టు బస్సులు మాత్రమే మున్నార్‌కు వెళ్లాయని, సాధారణంగా ఫిబ్రవరిలో.. ట్రావెల్స్ చాలా పని ఉంటుందనీ, కానీ ఈ కరోనా ఆంక్షల నడుమ ట్రావెల్స్ చాలా దెబ్బ తిన్నదని తెలిపారు.
రుణాలను తిరిగి చెల్లించడానికి గతేడాది 10 బస్సులను డిస్ట్రెస్ రేట్లకు విక్రయించనని, మిగిత బస్సులను కిలో రూ.45 స్క్రాప్ రేటుకు విక్రయించాలని అనుకుంటున్నని తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందనీ, చాలా మంది టూరిస్ట్ బస్సు ఆపరేటర్లు ఆత్మహత్యల చేసుకున్నారని అతను చెప్పాడు.
CCOA రాష్ట్ర అధ్యక్షుడు బిను జాన్ మాట్లాడుతూ .. కేరళలో టూరిస్ట్ బస్సుల సంఖ్య 14,000 నుండి 12,000 కంటే తక్కువకు పడిపోయిందని, ఆపరేటర్లు చెల్లించడంలో డిఫాల్ట్‌తో డబ్బు ఇచ్చేవారు వాటిలో కొన్నింటిని తీసుకువెళ్లారని అన్నారు. గత రెండు నెలల్లోనే 1,000కు పైగా బస్సులను బ్యాంకులు లేదా వడ్డీ వ్యాపారులు అటాచ్ చేశారన్నారు. మరో 2,000 నుంచి 3000 టూరిస్ట్ బస్సులను బ్యాంకులు, రుణదాతలు వచ్చే నెలలో అటాచ్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారుతున్న కోవిడ్ రూల్స్.. ట్రావెల్స్ అతిపెద్ద సమస్యగా ఉన్నట్టు పేర్కోన్నారు.
