Asianet News TeluguAsianet News Telugu

అలా తాకితే అత్యాచారం కాదా..? బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే..!

ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని... చట్టం ఇదే విషయాన్ని చెబుతోందని కోర్టు పేర్కొనడం గమనార్హం.

Top Court Puts On Hold "Disturbing" High Court Order On Minor's Groping
Author
Hyderabad, First Published Jan 27, 2021, 2:20 PM IST

బాంబే హైకోర్టు ఇటీవల ఓ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ తీర్పు పై సుప్రీం కోర్టు స్టే విధించింది. చిన్న పిల్లలను దుస్తులపై నుంచి పై నుంచి తాకితే అది అత్యాచారం కిందకు రాదంటూ ఇటీవల బాంబే హైకోర్టు పేర్కొనగా దానిపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది. ఆ తీర్పు పై స్టే విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పోక్సో చట్టం( లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపులకు కిందకు రాదని బాంబే హైకోర్టు పేర్కొనడం గమనార్హం. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని... చట్టం ఇదే విషయాన్ని చెబుతోందని కోర్టు పేర్కొనడం గమనార్హం.

లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి.. లేదా దుస్తుల లోపలికి చెయ్యి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకువ స్తుందని కోర్టు పేర్కొంది. 12ఏళ్ల బాలికపై 39ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారణ సందర్భంగా.. నాగ్ పూర్ బెంచెకు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 8 కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఐతే నిందితుడికి ఐపీసీ సెక్షన్ 354( మహిళ గౌరవానికి బంగం కలిగించడం) , సెక్షన్ 342( దురుద్దేశంతో నిర్భందించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2016లో సతీశ్ అనే వ్యక్తి బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశచూపించి తన ఇంటికి తీసుకువెళ్లాడు.  అక్కడ బాలిక ఛాతిని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా... దిగువ కోర్టు నిందితుడిని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ శిక్ష విధించింది.

దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా పైవిధంగా తీర్పు ఇచ్చారు. ‘పోక్సో చట్టం ప్రకారం విధించే కఠిన శిక్షల స్వభావాన్ని తీసుకుంటే.. నిందితుల నేరాన్ని నిరూపించడానికి గట్టి సాక్ష్యాలు, వారిపై తీవ్రమైన ఆరోపణలు ఉండాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడుతోంది. ఈ కేసులో నిందితుడు బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా, దుస్తుల లోపలికి చేతులు పెట్టాడా అన్న నిర్థిష్టమైన వివరాలు లేవు. కాబట్టి దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం’’ అని కోర్టు పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios