నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Today Tuesday 9th august Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:31 PM IST

చైనాలో మరో భయంకర వైరస్

చైనాలో నోవల్ లంగ్యా హెనిపా వైరస్‌ని గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు 35 మంది దారిన పడినట్లు తైవాన్‌కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో ఈ ఇన్ఫెక్షన్లు వెలుగుచూశాయి. ఈ వ్యాధి సోకితే మూత్రపిండ, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. 

8:40 PM IST

రేపు బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సారథ్యంలోని మహాఘట్ బంధన్‌ ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ఇప్పటికే రెండుసార్లు నితీశ్‌ను గవర్నర్ కలిశారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. 

7:43 PM IST

నల్గొండలో ప్రేమోన్మాది ఘాతుకం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడో యువకుడు. మానవత్వం మరిచి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

7:06 PM IST

ఆ ఐదు రోజులు తిరుమలకు రావొద్దు

వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్ట్ 11 నుంచి 15వ తేదీ వరకు తిరుమలకు వచ్చే వారికి సూచనలు చేసింది టీటీడీ. దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. రద్దీ వుండే నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. 

6:27 PM IST

మోడీ ఆస్తులు ఇవే

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు గతేడాదితో పోలీస్తే పెరిగాయి. ఏటా ఆస్తులు, అప్పులను వివరిస్తున్న ప్రధాని మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 2.23 కోట్లుగా వుంది. ఇందులో అత్యధికంగా బ్యాంక్ డిపాజిట్లే. ప్రధానికి ఎలాంటి స్థిరాస్థులు లేవని పీఎంవో ప్రకటించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో వున్న నివాస యోగ్యమైన భూమిలో తనకు రావాల్సిన వాటాను ప్రధాని దానమిచ్చారు. 

5:43 PM IST

గవర్నర్‌ను కలిసిన నితీష్, తేజస్వి యాదవ్

బీహార్ గవర్నర్‌ను నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్ కలిశారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ అందించారు. రేపు సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు మహాగట్భందన్ నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. 
 
4:41 PM IST

నాకు ప్రాణహాని వుంది...: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు ప్రాణహాని వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉగ్రవాదులు తనను టార్గెట్ చేసారని... ఈరోజు కాకున్నా రేపయినా ఉగ్రవాదులు తనను చంపుతారని రాజాసింగ్ పేర్కొన్నారు. 

3:55 PM IST

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసారు. కొద్దిసేపటిక్రితమే రాజ్ భవన్ కు చేరుకున్న ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ సిద్దమయ్యారు. 

2:37 PM IST

మిస్ ఇండియా రన్నరప్ రూబెల్ హీరోయిన్ గా తెలుగు సినిమా

మిస్ ఇండియా 2022 రన్నరప్ రూబెల్ షెకావత్ తెలుగు సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ప్రముఖ తెలుగు హీరో రవితేజ మేనల్లుడు  మాదవ్ భూపతిరాజు సరసన  'ఏయ్ పిల్లా' మూవీలో నటిస్తున్నట్లు రూబెల్ ప్రకటించారు. 
 
1:18 PM IST

బిజెపిలో చేరికపై సినీ నటి జయసుధ క్లారిటీ

కేంద్ర  హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ స్పందించారు. తాను బిజెపి చేరాలని నిర్ణయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు. బిజెపి నేతలు తనను సంప్రదించారని... పార్టీలో చేరాలంటూ కొన్ని షరతులు విధించినట్లు జయసుధ తెలిపారు.
 
12:04 PM IST

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ... షిండే కేబినెట్ లో మంత్రలు వీరే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా తాజాగా మరో 18మంది కొత్తగా షిండే మంత్రివర్గంలో చేరారు. బిజెపి నుండి 9 మంది, శివసేన రెబల్స్ 9 మందికి మంత్రిపదవులు దక్కాయి. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తో పాటు రాధాకృష్ణ పాటిల్, సుధీర్ ముంగటివార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. 

11:15 AM IST

నేపాల్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్

పొరుగుదేశం నేపాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తమ దేశ క్రికెట్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు భారత మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ ను చీఫ్ కోచ్ గా నియమించింది. ఇప్పటివరకు కెనడా హెడ్ కోచ్ గానే కాదు డిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రంజీ జట్లకు ప్రభాకర్ కోచ్ గా వ్యవహరించారు. 

10:24 AM IST

సెప్టెంబర్ 7నుండి కాంగ్రెస్ పార్టీ "భారత్ జోడో యాత్ర''

కాంగ్రెస్ పార్టీ ''భారత్ జోడో యాత్ర'' పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్ర సెప్టెంబర్ 17, 2022 నుండి ప్రారంభంకానుందని ప్రకటించారు. ఈ పాదయాత్రలో సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టనున్నారు.   
 
9:43 AM IST

దేశ రాజధాని డిల్లీలో కరోనా కలకలం... ఒక్కరోజే 1,372 కొత్త కేసులు

దేశ రాధజధాని డిల్లీలో మరోసారి కరోనా కలకలం మొదలయ్యింది. తాజాగా డిల్లీలో 1,372 కొత్త కోవిడ్ కేసులు నమోదవగా ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న ఆరుగురు మృతిచెందారు.  ప్రస్తుతం డిల్లీలో కరోనా పాజిటివిటి రేటు 17.85 శాతంగా వుందని... ఇది గత జనవరి తర్వాత అత్యధికమని డిల్లి హెల్త్ విభాగం తెలిపింది. 

9:32 AM IST

తెలుగు రాష్ట్రాలకు హైఅలర్డ్... 48గంటల్లో అతి భారీ వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో మళ్లీ వర్షబీభత్సం మొదలయ్యింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారే అవకాశం వుందని... దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఇరు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ట్రాఫిక్ జామ్ అవుతోంది. 

9:31 PM IST:

చైనాలో నోవల్ లంగ్యా హెనిపా వైరస్‌ని గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు 35 మంది దారిన పడినట్లు తైవాన్‌కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లలో ఈ ఇన్ఫెక్షన్లు వెలుగుచూశాయి. ఈ వ్యాధి సోకితే మూత్రపిండ, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. 

8:40 PM IST:

బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన సారథ్యంలోని మహాఘట్ బంధన్‌ ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ఇప్పటికే రెండుసార్లు నితీశ్‌ను గవర్నర్ కలిశారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు. 

7:43 PM IST:

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడో యువకుడు. మానవత్వం మరిచి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

7:06 PM IST:

వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్ట్ 11 నుంచి 15వ తేదీ వరకు తిరుమలకు వచ్చే వారికి సూచనలు చేసింది టీటీడీ. దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది. రద్దీ వుండే నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. 

6:27 PM IST:

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు గతేడాదితో పోలీస్తే పెరిగాయి. ఏటా ఆస్తులు, అప్పులను వివరిస్తున్న ప్రధాని మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 2.23 కోట్లుగా వుంది. ఇందులో అత్యధికంగా బ్యాంక్ డిపాజిట్లే. ప్రధానికి ఎలాంటి స్థిరాస్థులు లేవని పీఎంవో ప్రకటించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో వున్న నివాస యోగ్యమైన భూమిలో తనకు రావాల్సిన వాటాను ప్రధాని దానమిచ్చారు. 

5:43 PM IST:

బీహార్ గవర్నర్‌ను నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్ కలిశారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ అందించారు. రేపు సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు మహాగట్భందన్ నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. 
 
4:42 PM IST:

తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు ప్రాణహాని వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉగ్రవాదులు తనను టార్గెట్ చేసారని... ఈరోజు కాకున్నా రేపయినా ఉగ్రవాదులు తనను చంపుతారని రాజాసింగ్ పేర్కొన్నారు. 

3:55 PM IST:

బిహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసారు. కొద్దిసేపటిక్రితమే రాజ్ భవన్ కు చేరుకున్న ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు. ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ సిద్దమయ్యారు. 

2:37 PM IST:

మిస్ ఇండియా 2022 రన్నరప్ రూబెల్ షెకావత్ తెలుగు సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ప్రముఖ తెలుగు హీరో రవితేజ మేనల్లుడు  మాదవ్ భూపతిరాజు సరసన  'ఏయ్ పిల్లా' మూవీలో నటిస్తున్నట్లు రూబెల్ ప్రకటించారు. 
 
1:18 PM IST:

కేంద్ర  హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సినీ నటి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ స్పందించారు. తాను బిజెపి చేరాలని నిర్ణయించుకోలేదని క్లారిటీ ఇచ్చారు. బిజెపి నేతలు తనను సంప్రదించారని... పార్టీలో చేరాలంటూ కొన్ని షరతులు విధించినట్లు జయసుధ తెలిపారు.
 
12:05 PM IST:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా తాజాగా మరో 18మంది కొత్తగా షిండే మంత్రివర్గంలో చేరారు. బిజెపి నుండి 9 మంది, శివసేన రెబల్స్ 9 మందికి మంత్రిపదవులు దక్కాయి. మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తో పాటు రాధాకృష్ణ పాటిల్, సుధీర్ ముంగటివార్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. 

11:15 AM IST:

పొరుగుదేశం నేపాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తమ దేశ క్రికెట్ జట్టును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు భారత మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ ను చీఫ్ కోచ్ గా నియమించింది. ఇప్పటివరకు కెనడా హెడ్ కోచ్ గానే కాదు డిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రంజీ జట్లకు ప్రభాకర్ కోచ్ గా వ్యవహరించారు. 

10:24 AM IST:

కాంగ్రెస్ పార్టీ ''భారత్ జోడో యాత్ర'' పేరిట కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్ర సెప్టెంబర్ 17, 2022 నుండి ప్రారంభంకానుందని ప్రకటించారు. ఈ పాదయాత్రలో సీనియర్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టనున్నారు.   
 
9:43 AM IST:

దేశ రాధజధాని డిల్లీలో మరోసారి కరోనా కలకలం మొదలయ్యింది. తాజాగా డిల్లీలో 1,372 కొత్త కోవిడ్ కేసులు నమోదవగా ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న ఆరుగురు మృతిచెందారు.  ప్రస్తుతం డిల్లీలో కరోనా పాజిటివిటి రేటు 17.85 శాతంగా వుందని... ఇది గత జనవరి తర్వాత అత్యధికమని డిల్లి హెల్త్ విభాగం తెలిపింది. 

9:32 AM IST: