Telugu News Live : పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీకి 14 రోజుల కస్టడీ

Today Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:44 PM IST

పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీకి 14 రోజుల కస్టడీ

ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల కుంభకోణంలో అరెస్ట్ అయిన టీఎంసీ నేత, బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అనుమతించిం. దీంతో ఆగస్ట్ 18న కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు తదుపరి విచారణ జరపనుంది. 

9:06 PM IST

గన్నవరంలో వల్లభనేని- యార్లగడ్డ వర్గాల మధ్య ఘర్షణ

గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. వరలక్ష్మీ వ్రతం వేళ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకుంటున్నారు. 
 
8:29 PM IST

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్వీ రమణకు డాక్టరేట్ అందజేశారు. వచ్చే నెలలో సీజేఐగా ఆయన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.  

6:40 PM IST

21న అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి : రాజగోపాల్ రెడ్డి

జూలై 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి రుజువు చేయలేకపోయారని, ఇప్పటికైనా రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలోనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

6:01 PM IST

రేవంత్ రాకతో మాఫియాలా టీపీసీసీ: దాసోజు శ్రవణ్

పేదవాడికి సేవ చేయడంతో పాటు పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనే అరాచకమైన పరిస్ధితులు .. సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయన్నారు. 

4:29 PM IST

75వ స్వాతంత్య్ర వేడుకలు... 25 లక్షల త్రివర్ణ పతాకాల పంపిణీకి సిద్దమైన కేజ్రీవాల్ సర్కార్

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్దమయ్యింది. డిల్లీలోని ప్రభుత్వ  పాఠశాలల విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు 25లక్షల జాతీయ పతాకాలను అందించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందురోజు (ఆగస్ట్ 14 సాయంత్రం 5గంటలకు) ఈ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి జాతీయ గీతాన్ని ఆలపించాలని డిల్లీ ప్రజలకు ఆప్ సర్కార్ పిలుపునిచ్చింది. 

4:08 PM IST

స్వల్ప లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్స్

  భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 58,388 వద్ద,  నిప్టీ 16 పాయింట్లు లాభపడి 17,398 వద్ద ముగిసాయి. 
 
3:12 PM IST

పాకిస్థాన్ లో బాంబ్ పేలుడు... ఒకరు మృతి, 14 మందికి గాయాలు

పాకిస్థాన్ లో తాజాగా బాంబుపేలుడు జరిగి ఒకరు మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్థాన్ ప్రావిన్స్ లో పాక్ జాతీయ పతాకాలు అమ్ముతున్న షాప్ పై గుర్తుతెలియని దుండగులు గ్రానైట్స్ విసిరారు. దీంతో పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులతో సహా పలువురు గాయపగా,  ఒకరు మృతిచెందారు. 
 
1:46 PM IST

రాహుల్, ప్రియాంకను నిర్భంధించిన పోలీసులు... డిల్లీలో ఉద్రిక్తత

ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో భాగంగా కాంగ్రెస్ జాతీయస్థాయితో ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్లతో పాటు అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నల్లవస్త్రాలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించిన రాహుల్, ప్రియాంక, శశి థరూర్ ను పోలీసులు అడ్డుకుని నిర్భంధించారు. వారిని ఓ వాహనంలో అక్కడినుండి తరలించారు. 
 
12:53 PM IST

హుజురాబాద్ లో యుద్ద వాతావరణం... అంబేద్కర్ చౌరస్తాకు భారీగా బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు

టీఆర్ఎస్, బిజెపి సవాళ్లు ప్రతిసవాళ్లతో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బిజెపి ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ను నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తాకు భారీగా బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో ఇరువకర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో  ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. 
 
11:39 AM IST

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థికే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మార్గరేట్ ఆళ్వాకే మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ లీడర్ కే. కేశవరావు ప్రకటించారు. కాబట్టి 16మంది టీఆర్ఎస్ ఎంపీలో పార్టీ ఆదేశానుసారం మార్గరేట్ కు ఓటేయాలని సూచించారు. 

10:47 AM IST

భారత్ లో కరోనా కలకలం... మళ్ళీ 20వేలు దాటిన రోజువారి కేసులు

భారతుదేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య 20వేలు దాటింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 20,551 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364 కు చేరింది. అయితే తాజాగా నమోదయిన కరోనా కేసుల కంటే రికవరీ అయినవారి సంఖ్యే ఎక్కువగా వుండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 21,595 మంది కరోనా నుండి కోలుకున్నారు. 
 
9:39 AM IST

కామన్వెల్త్ గేమ్స్ లో సత్తాచాటుతున్న భారత్... 20 పతకాలతో ఆరోస్థానం

యూకే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఇండియా ఖాతాలో 20 పతకాలు చేరాయి.  ఇందులో ఆరు స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలున్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. 
 
9:35 AM IST

UK PM Race : భారత సంతతి రిషి సునక్ మరో ముందడుగు

యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ కు రోజురోజుకు ప్రజల మద్దతు మరింత పెరుగుతోంది. తాజాగా కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని రేసులో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ మధ్య జరిగిన ముఖాముఖి టెలివిజన్ చర్చలో ప్రేక్షకుల మద్దతు భారత సంతతి అభ్యర్థికే లభించింది. ఇలా సునక్ సునాయాసంగా విజయం సాధించారు. 

9:24 AM IST

రానున్న ఐదురోజులూ తెలంగాణలో కుంభవృష్టి

తెలంగాణలో ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత మరో మూడ్రోజులు (ఆది, సోమ, మంగళవారాలు) వర్షతీవ్రత మరింత పెరిగి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. కాబట్టి తెలంగాణ ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని సూచించారు. 

9:44 PM IST:

ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల కుంభకోణంలో అరెస్ట్ అయిన టీఎంసీ నేత, బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అనుమతించిం. దీంతో ఆగస్ట్ 18న కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు తదుపరి విచారణ జరపనుంది. 

9:06 PM IST:

గన్నవరం వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. వరలక్ష్మీ వ్రతం వేళ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకుంటున్నారు. 
 
8:29 PM IST:

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్వీ రమణకు డాక్టరేట్ అందజేశారు. వచ్చే నెలలో సీజేఐగా ఆయన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.  

6:40 PM IST:

జూలై 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి రుజువు చేయలేకపోయారని, ఇప్పటికైనా రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. త్వరలోనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

6:01 PM IST:

పేదవాడికి సేవ చేయడంతో పాటు పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనే అరాచకమైన పరిస్ధితులు .. సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్ధితులు చోటు చేసుకున్నాయన్నారు. 

4:29 PM IST:

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్దమయ్యింది. డిల్లీలోని ప్రభుత్వ  పాఠశాలల విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు 25లక్షల జాతీయ పతాకాలను అందించాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందురోజు (ఆగస్ట్ 14 సాయంత్రం 5గంటలకు) ఈ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి జాతీయ గీతాన్ని ఆలపించాలని డిల్లీ ప్రజలకు ఆప్ సర్కార్ పిలుపునిచ్చింది. 

4:08 PM IST:

  భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 58,388 వద్ద,  నిప్టీ 16 పాయింట్లు లాభపడి 17,398 వద్ద ముగిసాయి. 
 
3:12 PM IST:

పాకిస్థాన్ లో తాజాగా బాంబుపేలుడు జరిగి ఒకరు మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్థాన్ ప్రావిన్స్ లో పాక్ జాతీయ పతాకాలు అమ్ముతున్న షాప్ పై గుర్తుతెలియని దుండగులు గ్రానైట్స్ విసిరారు. దీంతో పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులతో సహా పలువురు గాయపగా,  ఒకరు మృతిచెందారు. 
 
1:46 PM IST:

ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో భాగంగా కాంగ్రెస్ జాతీయస్థాయితో ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్లతో పాటు అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నల్లవస్త్రాలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించిన రాహుల్, ప్రియాంక, శశి థరూర్ ను పోలీసులు అడ్డుకుని నిర్భంధించారు. వారిని ఓ వాహనంలో అక్కడినుండి తరలించారు. 
 
12:53 PM IST:

టీఆర్ఎస్, బిజెపి సవాళ్లు ప్రతిసవాళ్లతో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బిజెపి ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ను నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో అంబేద్కర్ చౌరస్తాకు భారీగా బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో ఇరువకర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో  ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. 
 
11:41 AM IST:

రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థికే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు మార్గరేట్ ఆళ్వాకే మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ లీడర్ కే. కేశవరావు ప్రకటించారు. కాబట్టి 16మంది టీఆర్ఎస్ ఎంపీలో పార్టీ ఆదేశానుసారం మార్గరేట్ కు ఓటేయాలని సూచించారు. 

10:47 AM IST:

భారతుదేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య 20వేలు దాటింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 20,551 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364 కు చేరింది. అయితే తాజాగా నమోదయిన కరోనా కేసుల కంటే రికవరీ అయినవారి సంఖ్యే ఎక్కువగా వుండటం ఊరటనిచ్చే అంశం. తాజాగా 21,595 మంది కరోనా నుండి కోలుకున్నారు. 
 
9:39 AM IST:

యూకే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఇండియా ఖాతాలో 20 పతకాలు చేరాయి.  ఇందులో ఆరు స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలున్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. 
 
9:35 AM IST:

యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ కు రోజురోజుకు ప్రజల మద్దతు మరింత పెరుగుతోంది. తాజాగా కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని రేసులో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ మధ్య జరిగిన ముఖాముఖి టెలివిజన్ చర్చలో ప్రేక్షకుల మద్దతు భారత సంతతి అభ్యర్థికే లభించింది. ఇలా సునక్ సునాయాసంగా విజయం సాధించారు. 

9:24 AM IST: