ఫేస్ బుక్ లో మైనర్ బాలికకు అసభ్య చిత్రాలు పంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

తమిళనాడు రాష్ట్రం ఎరోడే జిల్లాకు చెందిన కార్తీక్(22) అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా... కార్తీక్ కి ఫేస్ బుక్ లో ఓ మైనర్ బాలిక స్నేహితురాలిగా ఉంది. కాగా.. ఆ బాలికకు ఇటీవల కార్తీక్.. అసభ్యకర చిత్రాలు పంపించాడు. దీంతో.. షాకైన బాలిక వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.

తన తల్లిదండ్రుల సహాయంతో బాలిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కార్తీక్.. తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం.

పోక్సో చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.