పార్లమెంట్ లో మంగళవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. నవ వధువు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు యువ మహిళా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీలుగా నుస్రత్ జహన్, మిమి చక్రవర్తి లు గెలుపొందిన సంగతి తెలిసిందే. 

ఇద్దరూ ప్రమాణ స్వీకార సమయంలో వందేమాతరం, జై హిందీ, జై బంగ్లా అని సంబోధించడం విశేషం. ప్రమాణ స్వీకార అనంతరం నుస్రత్, మిమి స్పీకర్ ఓం బిర్లా వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
 
ఈ ఇద్దరూ నటీమణులే కావడం గమనార్హం. నుస్రత్ జహన్ ఇటీవలే వ్యాపారవేత్త నిఖిల్‌ను పెళ్లి చేసుకున్నారు. నవ వధువు ఇలా పార్లమెంట్ లో అడుగుపెట్టడం బహుషా ఇదే తొలిసారి కాబోలు. ఆమె ముఖంలో ఇంకా పెళ్లి కళ ఉట్టిపడుతోంది. ఆమె వివాహం టర్కీలో జూన్ 19న వీరి వివాహ వేడుక జరిగింది.