ఉపరాష్ట్రపతిని మళ్లీ వెక్కిరించిన టీఎంసీ ఎంపీ.. ‘ఇంకా వెయ్యిసార్లు చేస్తా’
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిని మళ్లీ వెక్కరించాడు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనను మిమిక్రీ చేశారు. అవసరమైతే ఇంకా వేయి సార్లు ఈ మిమిక్రీ చేస్తానని అన్నారు.
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను పార్లమెంటులో కించపరిచేలా అనుకరించడంపై వివాదాన్ని రేపింది. పార్లమెంటు ప్రాంగణంలో ధన్‌ఖడ్‌ను సోమవారం టీఎంసీ ఎంపీ ఇలా మిమిక్రీ చేశారు. ఆ తర్వాత జగదీప్ ధన్‌ఖడ్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. పార్లమెంటుకు, ఉపరాష్ట్రపతి హోదాకు అవమానం జరగకుండా చూస్తానని, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, దాన్ని కాంగ్రెస్ ఎంపీ వీడియో తీయడాన్ని తప్పుపట్టారు.
తాజాగా, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆదివారం మరోసారి మిమిక్రీ చేశారు. ‘నేను ఈ మిమిక్రీని చేస్తూనే ఉంటాను. ఇది ఒక కళాత్మకరూపం. అవసరమైతే.. నేను ఇంకా వేయి సార్లు చేయగలను. నా భావాలను వ్యక్తపరచడానికి నాకు ప్రాథమిక హక్కు ఉన్నది. మీరు నన్ను జైలులో పెట్టవచ్చు. కానీ, నేను వెనుకడుగు వేయను’ అని వివరించారు.
Also Read: Chandrababu Naidu: టీడీపీ ఆకర్ష్ ఆపరేషన్ స్టార్ట్?.. చంద్రబాబు వ్యాఖ్యల మర్మం ఏమిటీ?
పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీఎంసీ ఎంపీ బెనర్జీ.. ధన్‌ఖడ్ కేవలం చిన్ని చిన్ని విషయాలకు అంతాల గాయపడితే ఎలా? అంటూ ప్రశ్నించారు. తనను గాయపరిస్తే రైతులను గాయపరచినట్టేనని జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలనూ విమర్శించారు. అలాగైతే.. రైతు కుమార్తె సాక్షి మాలిక్, జాట్ కొడుకు బజరంగ్ పూనియాలు రిటైర్‌మెంట్ ప్రకటిస్తే, పద్మ శ్రీ పతకాన్ని వెనక్కి పంపించాలని తెలిపితే జగదీప్ ధన్‌ఖడ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు.