టిక్ టాక్ లో క్రియేటివ్ గా వీడియోలు తీసి... సెలబ్రెటీగా మారిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కవాలనే ఆ యువకుడిని తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మోహిత్‌ మోర్‌(24) అనే టిక్‌టాక్‌ సెలబ్రిటీను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.  టిక్‌టాక్‌లో మోహిత్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నజఫ్‌గఢ్‌ ప్రాంతంలో మోహిత్‌ ఓ ఫొటో స్టూడియోకు వెళ్లినప్పుడు ఈ దారుణం చోటుచేసుకుంది. అతను షాపు ముందున్న సోఫాలో కూర్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మోహిత్‌పై కాల్పులు జరిపి పారిపోయారు.

కాగా.. ఈఘటన అక్కడ ఉన్న సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. కాగా.. ఆ దుండగుల్లో ఇద్దరు వాళ్లు ముఖాలు కనపడకుండా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తపడ్డారు. కాగా... మోహిత్ శరీరంలోకి వాళ్లు 13 బులెట్లు దించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.