Asianet News TeluguAsianet News Telugu

తగ్గేదే ల్యా... సినిమాలు, వెబ్ సిరీస్ చూసి.. గ్యాంగ్ స్టర్లు కావాలనుకుని.. అమాయకుడిని హత్య చేశారు..

హత్యను ఆద్యంతం video తీశారు.  దీన్ని Instagramలో అప్లోడ్ చేయాలన్నది వారి ఆలోచన. కేవలం నేర ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలనే కోరికతోనే వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. 

three young boys murder one man by watching movies, web series in delhi
Author
Hyderabad, First Published Jan 21, 2022, 7:53 AM IST

ఢిల్లీ :  ‘పుష్ప, భౌకాల్ వంటి సినిమాలు, Web series చూసి మాకు కూడా అలా  చేయాలనిపించింది. వాటిలో చూపించిన Gangsters జీవనశైలి మమ్మల్ని ఆకట్టుకుంది’... చిరుప్రాయంలో హంతకులుగా మారిన ముగ్గురు చిన్నారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు.  దేశ రాజధాని నగరంలో jahangirpuri ప్రాంతంలో ఈ ముగ్గురూ కలిసి ఓ అమాయకుడిని murder చేశారు.  

అంతటితో ఆగకుండా చేసిన హత్యను ఆద్యంతం video తీశారు.  దీని 
Instagramలో అప్లోడ్ చేయాలన్నది వారి ఆలోచన. కేవలం నేర ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలనే కోరికతోనే వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. 

కత్తిపోట్లకు గురైన ఓ వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నట్లు బుధవారం బాబు జగ్జీవన్ రాం మెమోరియల్ హాస్పిటల్ నుంచి ఫోన్ రాగానే పోలీసులు పరుగులు తీశారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. పోలీసుల విచారణలో అతడు జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన శిబు (24) అని తేలింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. విషయం అంతా బయట పడినట్లు వాయువ్య ఢిల్లీ డీసీపీ ఉషా రంగ్నాని తెలిపారు. సినిమాలోని  గ్యాంగ్ స్టర్లను చూసి స్పూర్తి పొందిన ముగ్గురు కుర్రాళ్ళు ‘బద్నాం గ్యాంగ్’ పేరిట ఓ ముఠా ఏర్పాటు చేశారు.

ఈ ముఠాకు పేరు రావాలంటే ముందు ఓ వ్యక్తిని చంపాలని పథకం వేసుకున్నారు. ఈ మేరకు  jahangirpuri  ‘కే’ బ్లాక్ లోకి వెళ్లి ఒంటరిగా దొరికిన  శిబుతో అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. ఇద్దరూ అతనిపై దాడి చేస్తుండగా.. మూడో కుర్రాడు సెల్ ఫోన్లో ఈ  దృశ్యాలను చిత్రీకరించాడు. శిబును కర్రతో కొట్టి, చివరికి బాకుతో పొడిచి ఆ తరువాత… అక్కడి నుంచి పారిపోయారు. నేరం బయటపడి పోలీసుల అదుపులో ఉన్న బాల నేరస్తుల నుంచి, హత్యకు వాడిన బాకు, చిత్రీకరించిన సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, యూట్యూబ్ లో చూసి ఏటీఎంల చోరీకి పాల్పడుతున్న ముఠాను జనవరి 14న ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  youtube లో చూసి ATMలలో డబ్బులు robbery చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు  arrest చేశారు. ఈ మేరకు పలమనేరు డిఎస్పి గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి (41), పొలకల నరేష్ (29), మాధవ రెడ్డి (25), గుడిపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి (21)లు తిరుపతి లో ఉంటూ స్నేహితులయ్యారు.

వీరంతా సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. దీనికోసం ఏం చేయాలా? అని కొద్ది రోజులు ఆలోచించారు. డబ్బులు బాగా ఉండే ఏటీఎంలలో చోరీ చేయడం వల్ల తొందరగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని ఆలోచన చేశారు. దీనికోసం ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు.

దాంట్లో చూపించిన మేరకు పరికరాలను కొనుగోలు చేయడం కోసం..చెన్నై వెళ్లారు. కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చారు. ఆ తరువాత ముందుగా ఎట్టేరిలో  రిహార్సల్స్ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాలెం ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. Siren శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటిరోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ బిఐ ఎటిఎంలో చోరీకి ప్రయత్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios