Asianet News TeluguAsianet News Telugu

ఒక్క దున్నపోతు కోసం.. రక్తం చిందించిన మూడు గ్రామాలు..

కర్ణాటకలో విచిత్రం జరిగింది.. ఓ దున్నపోతు కోసం మూడు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఈ ఘటన కర్ణాటకలోని దావనగెరె జిల్లాలో జరిగింది. నాలుగేళ్ల వయసున్న ఓ దున్నపోతు ఎక్కడినుంచో దారి తప్పి సాస్వేహళ్లీ గ్రామానికి చేరుకుంది.

three villagers fight for one yak in karnataka - bsb
Author
Hyderabad, First Published Jan 28, 2021, 12:02 PM IST

కర్ణాటకలో విచిత్రం జరిగింది.. ఓ దున్నపోతు కోసం మూడు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఈ ఘటన కర్ణాటకలోని దావనగెరె జిల్లాలో జరిగింది. నాలుగేళ్ల వయసున్న ఓ దున్నపోతు ఎక్కడినుంచో దారి తప్పి సాస్వేహళ్లీ గ్రామానికి చేరుకుంది.

గ్రామస్తులు ఆ దున్నపోతును ఆంజనేయ స్వామికి మొక్కుకుని గుడిలో వదిలేశారు. అయితే ఆ తప్పిపోయి వచ్చిన దున్నపోతు తమదేనని శివమొగ్గ జిల్లా జాంబరగట్టే గ్రామస్తులు అంటున్నారు. వీరిద్దరి మధ్య చీలూరు గ్రామస్తులు వచ్చి ఆ దున్నపోతు తమదంటూ వాదనకు దిగారు.

దీంతో మూడు వర్గాల మధ్య ఘర్షణ పెద్దదయ్యింది. గ్రామస్తులు తీవ్రంగా కొట్టుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గొడవ ఆపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ మూడు గ్రామస్తులతో పోలీసులు చర్చించి ఆ దున్నపోతును జాంబరగట్టె గ్రామస్తులకు అప్పగించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios