ముగ్గురు అక్కాచెల్లెళ్లపై.. ఐదుగురు కామాంధుల పైశాచికం.. నెలల తరబడి అత్యాచారం

First Published 19, Jul 2018, 11:01 AM IST
three sisters Raped by five persons at mysore
Highlights

కర్ణాటకలో ఘోరం జరిగింది.. ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు

కర్ణాటకలో ఘోరం జరిగింది.. ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మైసూర్‌‌లోని ఉదయగిరికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వారిలో పెద్దమ్మాయి వయసు 18 ఏళ్లు.. రెండో అమ్మాయి వయసు 17 సంవత్సరాలు.. మూడో అమ్మాయికి పదహారేళ్లు. వీరి ఆచూకీ కోసం కొన్ని రోజుల పాటు తల్లి తెలిసిన వారి సాయంతో గాలించింది.

అయితే... ఎంతకీ వీరి జాడ తెలియకపోవడంతో తల్లి స్థానికంగా ఉన్న ‘ ఒడనాడి సేవా సమస్థే’  అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఆ సంస్థ ప్రతినిధులు..  నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆ బాలికలను బాగా సంపాదించుకోవచ్చని చెప్పి.. పొరిగింటి వ్యక్తి ఆశ చూపాడు.. అతని మాటలు నమ్మిన బాలికలను బెంగళూరు, మంగళూరు, మాండ్య తదితర ప్రాంతాల్లో ఆ వ్యక్తితో పాటు తిరిగారట..

ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు ఆ అక్కాచెల్లెళ్లపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆ సంస్థ తెలిపింది.. అంతేకాకుండా వారితో బలవంతంగా వ్యభిచారం కూడా చేయించినట్లు తెలిపింది. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు వెల్లడించారు.
 

loader