Asianet News TeluguAsianet News Telugu

PM Modi Security Lapse : మోదీ కాన్వాయ్ ఆపింది మేమే.. ఎస్ఎఫ్ జే నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్...

‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ఆఫ్ సుప్రీం సుప్రీం కోర్ట్ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన  బెదిరింపు కాల్స్ వచ్చాయి.  జనవరి 10న ఉదయం 10:40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్ వాలా ఫ్లైఓవర్ పై మోదీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు.

Threat Calls from SFJ Over PM Security Lapse Case, Allege Supreme Court Lawyers
Author
Hyderabad, First Published Jan 11, 2022, 6:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఢిల్లీ :  పంజాబ్ లో రోడ్డుపై ప్రధాని narendra modi Convoy దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం మేమే అంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రధాని పర్యటనలో PM Security Lapse Caseపై జరుగుతున్న దర్యాప్తు నిలిపివేయాలంటూ అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ Six For Justice (ఎస్ఎఫ్ జే) నుంచి అనేక  ఫోన్ కాల్స్ వచ్చాయని Supreme Court Bar Association ధర్మాసనానికి నివేదించింది.

మోదీ కాన్వాయ్ ను అడ్డగించింది తామేనని... ఎస్ఎఫ్ జే పేర్కొందటూ సోమవారం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ ఘటనపై ఎన్జీవో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపొద్దని న్యాయమూర్తులను బెదిరించారని వివరించింది.

‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ఆఫ్ సుప్రీం సుప్రీం కోర్ట్ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన  బెదిరింపు కాల్స్ వచ్చాయి.  జనవరి 10న ఉదయం 10:40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్ వాలా ఫ్లైఓవర్ పై మోదీ కాన్వాయ్ ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడానికి సుప్రీంకోర్టు విఫలమైందని,  వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టవద్దని ఫోన్ కాల్ లో హెచ్చరించారు’ అని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి లేఖ రాసింది.

విచారణ చేపడితే జాతీయ సమగ్రతను దెబ్బ తీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని కూడా భయపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అడ్వకేట్లు తమ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని వారి ఫోన్లు హ్యాకింగ్కు గురైతే ఇవన్నీ దుర్వినియోగం అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.  న్యాయవాదుల అందరికీ ఇలాంటి కాల్స్ వస్తున్నాయంటూ దీపక్ ప్రకాష్ అనే లాయర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకన్న భద్రతా వైఫ్యల్యం ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ  ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతన్న అన్ని విచారణలను నిలిపివేయాలని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. 

ఈ ఘటనపై విచారణకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చండీగఢ్‌ డీజీపీ, ఎన్‌ఐఏ ఐజీ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సభ్యులుగా ఉండనున్నారు. తాము ఆదేశించిన విచారణను కొనసాగించాలని కేంద్రం, పంజాబ్‌లోని ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. ఈ కమిటీలో పంజాబ్ నుంచి కూడ ప్రాతినిధ్యం ఉంటుందని సీజేఐ అన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సీజేఐ ధర్మాసనం వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనుంది.
 
ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనపై విచారణ చేపట్టాలని కోరుతూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ దాఖలైన  పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శుక్రవారం సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసం విచారణ చేపట్టగా..  ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్‌ అండ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. 

ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios