Asianet News TeluguAsianet News Telugu

పక్కింటిగోడకు కన్నంపెట్టి, బ్యాంకు ఛోరీ.. రూ.55లక్షలు మాయం.. !

ఢిల్లీలోని షాహదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం భారీ దొంగతనం జరిగింది. బ్యాంకులోని రూ. 55లక్షలు దుండగులు దోచుకున్నట్టుగా సోమవారం పోలీసులు తెలిపారు. బ్యాంకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం గోడలు పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారని వారు తెలిపారు.

thieves enter delhi union bank of india branch by drilling hole, and steal rs.55 lakhs - bsb
Author
Hyderabad, First Published Jun 22, 2021, 9:18 AM IST

ఢిల్లీలోని షాహదరా ప్రాంతంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఆదివారం భారీ దొంగతనం జరిగింది. బ్యాంకులోని రూ. 55లక్షలు దుండగులు దోచుకున్నట్టుగా సోమవారం పోలీసులు తెలిపారు. బ్యాంకు పక్కన నిర్మాణంలో ఉన్న భవనం గోడలు పగలగొట్టి దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారని వారు తెలిపారు.

శుక్రవారం, శనివారం బ్యాంకు డిపాజిటర్ల నుంచి సేకరించిన నగదు ఛోరీ అయినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకులోని మరో వైపు ఉన్న అన్ని లాకర్లు మరియు ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయని వారు తెలిపారు.

ఈ దోపిడీ గురించి వార్తలు వ్యాపించడంతో బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. వారంతా బ్యాంకుముందు క్యూలు కట్టారు. ఒక కస్టమర్ మాట్లాడుతూ.. ‘మా బంధువులు చాలామందికి ఈ బ్యాంకులో ఖాతాలున్నాయి. దొంగతనం గురించి వారి ద్వారామాకు తెలిసింది. మాకూ ఇక్కడ ఖాతా ఉంది. బిజినెస్ అకౌంట్ కూడా ఉంది. అందుకే ఆందోళనగా ఉంది. కానీ మేనేజ్మెంట్ ఏ విషయమూ చెప్పడం లేదు’ అన్నారు.

ఆదివారం దొంగతనం జరగగా సోమవారం ఉదయం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బ్యాంకులోకి ప్రవేశించడానికి దొంగలు చేసిన రంధ్రాన్ని పరిశీలించారు. 

బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరా ఫుటేజ్ ద్వారా దొంగలలో ఒకరిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనంలో ఎంతమంది పాల్గొన్నారో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ నేరానికి పాల్పడిన వారందరినీ గుర్తించి అరెస్టు చేయడానికి చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios