19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఆ సిలిండర్ లపై రూ.209లను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 

కమర్షియల్ గ్యాస్ ధర ఒక్క సారిగా భారీగా పెరిగింది. ఒక్క సిలిండర్ పై ఏకంగా 209 రూపాయిల ధర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) నిర్ణయం తీసుకున్నాయి. గత నెల ప్రారంభంలో దీని ధరను రూ.158కి తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ మళ్లీ నెల రోజుల్లోపే ధరను పెంచేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి రానుంది. రక్షా బంధన్‌ సందర్భంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఎల్ పీజీ ధరలను రూ.200 తగ్గించింది. ఉజ్వల పథకంలో లబ్దిదారులుగా ఉన్న వినియోగదారులకు మరో రూ.200 అదనంగా తగ్గించింది. ఈ పరిణామంతో పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా స్పందించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 158 తగ్గించాయి. 

అయితే తాజాగా ఈ 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.209లను పెంచాయి. ఈ ధర ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. గత నెల వరకు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,522గా ఉంది. నేటి నుంచి దీనికి అధనంగా రూ.209 వచ్చి చేరనున్నాయి.

కాగా. వాణిజ్య, దేశీయ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలు ప్రతి నెల మొదటి రోజున సవరణలు చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. 

కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ముఖ్య పట్టణాల్లో కింది విధంగా ఉండనున్నాయి.
ఢిల్లీ - రూ.1,731.50
ముంబై - రూ.1684
లక్నో - రూ.1,845
చెన్నై - రూ.1,898
బెంగళూరు - రూ.1,813
కోల్ కత్తా - రూ.1,839