ఈ కుక్క రతన్ టాటా తో ఆఫీస్ కి వెళ్తుంది.. మీటింగ్స్ కూడా..!
పెంపుడు జంతువులపై ఆయనకున్న ప్రేమకు కూడా ప్రసిద్ది, ముఖ్యంగా కుక్కలు. బొంబాయిలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.
టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. ఒక విభాగానికి ప్రయోజనం చేకూర్చడం లేదా ఒక సంస్థకు విరాళం ఇవ్వడం అయినా రతన్ టాటా వీటన్నిటిలో ముందంజలో ఉంటారు.
దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన రతన్ టాటా మనుషులకు మాత్రమే కాదు, పెంపుడు జంతువులపై ఆయనకున్న ప్రేమకు కూడా ప్రసిద్ది, ముఖ్యంగా కుక్కలు. బొంబాయిలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కుక్కల కోసం నిర్మించాడు.
కాగా...టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కుక్కల కోసం ఒక ఇల్లు కూడా నిర్మించారు. ఇక్కడి వీధి కుక్కలు చాలా కాలం నుండి బొంబాయి హౌస్ లో నివసిస్తున్నాయి. కాగా.. వాటిల్లో ఓ వీధి కూడా చాలా స్పెషల్ తెలుసా. ఆ వీధి కుక్క... రతన్ టాటా తో పాటు ఆఫీసుకు కూడా వస్తుంది. పక్క సీట్లో చైర్ లో కూడా కూర్చుంటందట. ఆయనతోపాటు ఆ కుక్క కూడా మీటింగ్స్ కి హాజరౌతుంది. ఇటీవల ఓ మహిళ .. రతన్ టాటాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లగా.. ఈ కుక్క గురించి తెలియడం గమనార్హం. సదరు కుక్క పేరు గోవా. అది కూడా.. టాటా ఏది చెబితే అది వింటుందట. ఇంటర్వ్యూ తర్వాత.. ఆమె.. ఈ కుక్క గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' వ్యవస్థాపకురాలు కరిష్మా మెహతా సోమవారం షేర్ చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తాను రతన్ టాటాను మొదటిసారి కలిసినప్పుడు.. గోవా అనే కుక్క ఆయన పక్కనే కూర్చొని ఉందని చెప్పడం విశేషం. "నేను మిస్టర్ టాటా కార్యాలయం వెలుపల వేచి ఉండగా, అతని ప్రక్కన ఉన్న కుర్చీలో ఒక కుక్క సౌకర్యవంతంగా ఉంచి ఉండటం గమనించాను" అని Ms మెహతా రాశారు.
కాగా.. తనకు కుక్కలంటే భయమని.. చాలా సేపు ఇంటర్వ్యూ చేయడానికి కూడా సంకోచించినట్లు ఆమె చెప్పారు. అయితే.. టాటా.. సదరు కుక్కకు.. మనిషితో మాట్లాడినట్లు ఆమె నీకు భయపడుతోంది. దగ్గరకు వెళ్లొద్దు అని చెప్పారట. అది కూడా.. ఇంటర్వ్యూ దాదాపు 40 నిమిషాలపాటు సాగినా.. ఆమె వద్దకు వెళ్లకుండా అక్కడే ఉందట. ఈ విషయం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె చెప్పారు.