లక్నో-ఢిల్లీ హైవేపై అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. లైంగిక దాడి అనంతరం హత్య ?
ఉత్తరప్రదేశ్ లో ఢిల్లీ-లక్నో హైవే పై ఓ మహిళ మృతదేహం అర్థనగ్న స్థితిలో కనిపించింది. షాజహాన్ పూర్ ఆమె అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి సమీపంలో గుర్తుతెలియని మహిళ అర్థనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. మధ్య వయస్కరాలైన ఆమెపై గుర్తు తెలియని దుండగులు లైంగిక దాడి చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘోరం.. కుటుంబ సభ్యులను కట్టేసి, వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..
మృతురాలు ఎవరన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆమె ఫొటోలను సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పంపించామని షాజహాన్ పూర్ ఎస్ఎస్పీ అశోక్ కుమార్ మీనా మీడియాతో ‘జీ న్యూస్’ తో తెలిపారు. శవపరీక్ష నివేదిక ఈ కేసులో కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘటన
పోస్టుమార్టం నిర్వహించిన బృందంలోని ఒక సభ్యుడు మాట్లాడుతూ.. ‘‘బాధితురాలిపై లైంగిక దాడి జరిగాయేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. అయితే పదునైన ఆయుధంతో మెడకు తగిలిన గాయమే మరణానికి కారణం’’ అని ఆయన తెలిపారు. కాగా.. బాధితురాలిని వేరే చోట హత్య చేసి మృతదేహాన్ని హైవే పక్కన పడేసి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు