ముగ్గురు తెలుగు కుర్రాళ్ళు.. తమ రాజకీయ వ్యుహాలతో దేశంలోని పలు పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేవలం రెండు అసెంబ్లీ స్థానాల ప్రణాళికలు రచించిన వీరు.. అక్కడ వారు అనుకన్న అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోగలిగారు.
భారతదేశంలో ఎన్నికల ప్రచార సరళిలో మార్పులు కనిపిస్తున్నాయి. చాలావరకు రాజకీయ నేతలు అంచనాలు వేసుకుని.. పక్కాగా బరిలో దిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ వ్యుహాకర్తల మద్దుతుతో ఎన్నికల ప్రచార ప్రణాళికలు రూపొందించుకుని విజయం సాధించేలా అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. అయితే చాలా చోట్ల పార్టీలకు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయ వ్యుహాకర్తగా పీకే(ప్రశాంత్ కిషోర్) తనకంటూ జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్, ఏపీలో వైసీపీ ప్రభుత్వాల ఏర్పడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఒక్కడితోనే అయ్యే పనికాదు.. ఇందుకోసం అతని కింద పెద్ద టీమ్స్ పనిచేస్తుంటాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీకరించి.. ప్రజల నాడీ తెలుసుకుంటూ తాము గెలిపించాల్సిన అభ్యర్థిని ప్రజలకు ఎలా చేరువ చేయాలో అనేది వారు ప్లానింగ్ చేస్తారు.
అయితే ముగ్గురు తెలుగు కుర్రాళ్ళు.. తమ రాజకీయ వ్యుహాలతో దేశంలోని పలు పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేవలం రెండు అసెంబ్లీ స్థానాల ప్రణాళికలు రచించిన వీరు.. అక్కడ వారు అనుకన్న అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోగలిగారు. అందులో పెద్ద విశేషమిటంటని అనుకుంటున్నారా.. పంజాబ్‌లో ఆప్ ప్రభంజనంలో శిరోమణి అకాలీదళ్ కూటమి అభ్యర్థులు విజయాన్ని చేకూర్చి పెట్టడమే.
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించి భారీ విజయం సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 18, బీజేపీ 2 స్థానాల్లో గెలుపొందాయి. అయితే బీఎస్పీతో కూటమిగా బరిలో నిలిచిన Shiromani Akali Dal.. మొత్తం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అందులో బీఎస్పీ ఒక్క స్థానంలో, శిరోమణి అకాలీదళ్ మూడు స్థానాల్లో గెలిచింది.
అయితే శిరోమణి అకాలీదళ్ banga constituencyలో, బీఎస్పీ NawanShahr గెలవడంలో ఈ కుర్రాళ్లు కీలక పాత్ర పోషించారు. తాము ఈ రెండు స్థానాలకు క్యాంపైయిన్ చేశామని.. రెండు చోట్ల తాము క్యాంపైయిన్ చేసిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా 100 శాతం సక్సెస్ సాధించామని నాయిని అనురాగ్ రెడ్డి, ముఖేష్ చౌదరి, కృష్ణా రెడ్డిలు గర్వంగా చెబుతున్నారు. వీరు Fortune Walk పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి అనురాగ్, ముఖేష్ లు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉండగా... చీఫ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా కృష్ణా రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తమ పోల్ ప్లాన్‌లో భాగంగా ఎన్నికలకు 8 నెలల ముందు నుంచే దాదాపుగా 60 మందితోని కూడిన రెండు టీమ్స్ బంగా, నవాన్ షహర్ నియోజకవర్గాలపై పూర్తి దృష్టి కేంద్రీకరించారు. స్థానిక సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. వాటిపై తమ పార్టీ అభ్యర్థులచేత ప్రకటన చేయించారు. స్థానిక రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులను క్షుణంగా పరిశీలించారు. ఏ ప్రాంతంలో వెనకబడుతున్నామనేదానిపై ఓ క్లారిటీ తెచ్చుకుని.. అక్కడ పుంజుకునేలా ప్రణాళికలు రచించారు.
ఆ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు IELTS తదితర హామీలు, మహిళలకు పెన్షన్ వంటి వాటిపై దృష్టి సారించి.. వాటిని ప్రచార ఆస్త్రాలుగా మార్చుకున్నారు. అంతేకాకుండా మహిళలు, యువత.. ఇలా ప్రతి వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళికలు రచించారు. ఇక, బూతు స్థాయిలో అభ్యర్థుల మద్దతుదారుల ఓట్లు చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకోసం పలుమార్లు డమ్మీ పోలింగ్ నిర్వహించి.. వారి మెదళ్లలో మరో ఆలోచన లేకుండా చేశారు.
క్షేత్ర స్థాయిలో బృందాల నుంచి సమాచారం సేకరిస్తూ.. స్ట్రాటజీని మార్చుకున్నారు. ఓ దశలో ఆప్‌తో తగ్గ పోరు ఉంటుందని భావన కలగడంతో.. అక్కడ వారు పోరును ట్రయాంగిల్‌గా మార్చడం ద్వారా వారికి లబ్ది కలిగేలా చేసుకున్నారు. ఇలా తమదైన శైలిలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచించి.. ఇద్దరు అభ్యర్థులను గెలిపించారు. ఈ విధంగా సత్తా చాటిన ఈ కుర్రాళ్లు, ఇప్పుడు పలు రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తొలుత చిన్న ప్రయత్నంలో విజయాన్ని అందుకున్న వీరు.. భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.
"
