Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిది దేశాల్లో తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ వేడుకలు

Bathukamma: బ‌తుక‌మ్మ.. ఒక పండుగ మాత్ర‌మే కాదు.. తెలంగాణ ప్ర‌జ‌ల జీవ‌నం.. ఇక్క‌డి మ‌ట్టి మ‌నుషుల సాంస్కృతి సౌర‌భం. అందుకే ఖండాత‌రాలు దాటి జీవ‌నం సాగిస్తున్న తెలుగు ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఎంతో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను జరుపుకుంటున్నారు.  
 

Telangana Jagruthi Bathukamma festival celebrations in eight countries
Author
First Published Sep 25, 2022, 1:22 PM IST

Bathukamma festival celebrations: తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ వేడుకలను ఎనిమిది దేశాల్లో నిర్వహించనుంది. తెలంగాణ ప్ర‌జ‌లు తొమ్మిది రోజుల పాటు జ‌రుపుకునే ఈ వేడుక‌ను..  ఖండాత‌రాలు దాటి జీవ‌నం సాగిస్తున్న తెలుగు ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఎంతో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను జరుపుకుంటున్నారు. తెలంగాణ జాగృతి ప్రపంచ బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. రాష్ట్ర విశిష్ట సంస్కృతి బతుకమ్మను ప్రపంచ పటంలో అంగరంగ వైభవంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లో బతుకమ్మ వేడుకలు జరగనుండగా, తెలంగాణ జాగృతి ఆయా కార్యక్రమాలను నిర్వహించనుందని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. బాల్కొండలో జరిగిన బ‌తుక‌మ్మ చీరల బహుమతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

"కమ్మర్‌పల్లి బాల్కొండలో, తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ చీరల బహుమతి కార్యక్రమానికి నా ప్రియమైన సోదరీమణులతో క‌లిపి పాలుపంచుకున్నాను" అని ఆమె ట్వీట్ చేసింది.

 


తెలంగాణలో విస్తృతంగా ప్రజాదరణ పొందిన.. మ‌హిళ‌లు ఎంతో ఘ‌నంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మను గ‌త సంవ‌త్స‌రం దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించారు. దసరా పది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. కాగా, ఈ కార్య‌క్ర‌మానికి ముందు ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యానికి బీజేపీ భంగం కలిగిస్తోందని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)  నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా అనుకూల, సంక్షేమ ఆధారిత దృక్పథం కోసం పాల‌న సాగిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బాల్కొండలోని కమ్మర్‌పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"సమాజాన్ని విభజించి మత సామరస్యానికి భంగం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశంలో నేడు భారీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి సమాధాన‌మేది?  దీనిని పరిష్కారం ఉందా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలోని అన్ని మతాలను సమానంగా గౌరవించే, సంబరాలు చేసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను చూడాలంటూ పేర్కొన్నారు. భారీ ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి బీజేపీని ప్రశ్నించాలని మహిళలను కోరారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు. వారి పెద్ద వాదనలకు విరుద్ధంగా యూనియన్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? అని ప్ర‌శ్నింస్తూ.. ఎంపీ అరవింద్ దీనికి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ యువతకు 2 లక్షల మందికి పైగా ఉపాధి అవ‌కాశాలు, లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చార‌ని తెలిపారు. బీజేపీ దేశానికి ఏం ఇచ్చింది? అని కవిత  ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణతో పోల్చిన ఆమె..  “ఉత్తరప్రదేశ్‌లో 23 కోట్ల జనాభాలో కేవలం 70 లక్షల మంది మాత్రమే పింఛన్లు పొందుతున్నారు, అయితే 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 48 లక్షల పింఛన్లను అందించిందన్నారు. దేశంలో ఎక్కువ పింఛ‌న్ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం అందిస్తున్న బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అక్క‌డికి వ‌చ్చిన వారికి అందించారు. అనంత‌రం అక్క‌డున్న మ‌హిళ‌ల‌తో ముచ్చ‌టించారు.

Follow Us:
Download App:
  • android
  • ios