ఓ 17ఏళ్ల బాలిక చేత మద్యం తాగించి.. కొందరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
మైనర్ బాలికకు బలవంతంగా మద్యం తాగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ కచ్ జిల్లాలోని భుజ్ పట్టణ శివారుల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలిక చేత మద్యం తాగించి.. కొందరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఈ నెల 16న జరిగిన ఘటనకు సంబంధించి మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక తన ఫ్రెండ్‌తో కలిసి పోలానికి వెళ్లింది. అక్కడే నిందితుడు.. ఆమె చేత మద్యం తాగించాడు. తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఓ నిందితుడిని బాలిక గుర్తించింది. మరో వ్యక్తి బాలికను అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. బాలిక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మరో ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేదా? అన్నది తెలుసుకోవడం కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 366, సెక్షన్ 328, సెక్షన్ 376, సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.
