Asianet News TeluguAsianet News Telugu

ఓ వైపు పోలీసు బందోబస్తు,మరోవైపు కాలేజీలో యువతిపై అత్యాచారం.. వీడియో తీసి..

అదే కాలేజీలో ఆ సమయంలో.. సివిల్స్  సర్వీసెస్ పరీక్ష జరుగుతుండటం గమనార్హం. ఆ పరీక్షకు పోలీసు బందో బస్తు కూడా ఉంది. అదే సమయంలో యువతిపై ఈ దారుణం చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. సదరు యువతిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా కాలేజీలోకి తీసుకువెళ్లారు.

Teen girl raped, filmed inside college in Uttar Pradesh's Jhansi during civil services exam nra
Author
Hyderabad, First Published Oct 12, 2020, 1:09 PM IST

దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనడానికి ఈ సంఘటన మరో ఉదాహరణ. బడి,  గుడి ని మించి రక్షణ ఇంకెక్కడ ఉంటుంది అని అంటారు. అలాంటి ప్రదేశాల్లోనూ యువతులపై అత్యాచారాలు చోటుచేసుకోవడం బాధాకరం. తాజాగా... కాలేజీలోనే ఓ యువతిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని వీడియో తీసి ఆమెను బెదిరించడం మరింత బాధాకరం. ఈ దారుణ సంఘటన  ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని ఓ పాలిటెక్నిక్ కాలేజీ క్యాంపస్ లో ఓ 17ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అదే కాలేజీలో ఆ సమయంలో.. సివిల్స్  సర్వీసెస్ పరీక్ష జరుగుతుండటం గమనార్హం. ఆ పరీక్షకు పోలీసు బందో బస్తు కూడా ఉంది. అదే సమయంలో యువతిపై ఈ దారుణం చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. సదరు యువతిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా కాలేజీలోకి తీసుకువెళ్లారు.

అనంతరం యువతిని వివస్త్రను చేసి  అసభ్యకరంగా వీడియోలను చిత్రీకరించారు. అనంతరం.. ఓ యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు యువతి తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్లగా.. దాదాపు 20మంది యువకులు ఆమెపై దాడికి పాల్పడి.. ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. ఆమె బాయ్ ఫ్రెండ్ ని దారుణంగా కొట్టి.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

యువతి వద్ద ఉన్న రూ.2వేలు నగదు కూడా లాక్కున్నారు. వారిలో ఒకరు యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో మిగిలిన వాళ్లు వీడియో తీశారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా.. బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులంతా.. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న వారే కావడం గమనార్హం. ఆ యువతి పై వీరంతా దాడి చేస్తున్న సమయంలో.. కాలేజీలో సివిల్స్ పరీక్ష జరుగుతుంది. పోలీస్ ప్రోటెక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. ఆ సమయంలో.. అటుగా ఓ పోలీసు అధికారి వెళ్లగా..  అతనికి.. యువతి ఏడుపు, అరుపులు వినిపించాయి. దీంతో.. వెంటనే స్పందించి యువతిని రక్షించారు. సదరు యువతిని సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేలా ఆ పోలీసు సహకరించినట్లు తెలుస్తోంది.  ఇప్పటి వరకు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios